Advertisement
ఏపీలో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆపార్టీ నేత నారా లోకేష్ కదిలారు. ఈనెల 27 నుంచి యువగళం ఆయన పాదయాత్ర చేపట్టనున్నారు. 400 రోజులపాటు 4 వేల కిలోమీటర్లు నడవనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆయన కుటుంబంతో కలిసి పూజలు జరిపారు. ముందుగా తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత అత్తమామలు బాలకృష్ణ, వసుంధర ఆత్మీయ ఆశీస్సులు అందుకున్నారు.
Advertisement
లోకేష్ యాత్రకు బయలుదేరుతుండగా.. చంద్రబాబు హత్తుకుని ఉద్వేగానికి గురయ్యారు. ఇక ఆయన సతీమణి బ్రాహ్మణి తిలకం దిద్ది హారతి ఇచ్చారు. ఆ సమయంలో కుమారుడు దేవాన్ష్ నీ అప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు లోకేష్. ఇంటి నుంచి నేరుగా ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లారు ఆయన. అక్కడ పార్టీ నేతలతో కలిసి తాత ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు.
Advertisement
ఇక శంషాబాద్ ఎయిర్ పోర్టుకి చేరుకుని కడప వెళ్లారు లోకేష్. టీడీపీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కడప వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కడప పెద్ద దర్గాని సందర్శించి, చాదర్ సమర్పించారు. మత పెద్దలను అడిగి దర్గా విశిష్టతను తెలుసుకున్నారు లోకేష్. అలాగే, కడపలోనే మరియాపురం చర్చికి కూడా వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
కడప టూర్ తర్వాత రోడ్డు మార్గంలో తిరుమల వెళ్లారు. రాత్రికి తిరుమలలోనే బస చేసి.. గురువారం ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు. 27న కుప్పం నుంచి యువగళం పాదయాత్రను ప్రారంభిస్తారు లోకేష్.