Advertisement
ఏపీలో సినిమా టికెట్ల విషయంలో ఎంత లొల్లి జరిగిందో చూశాం. ఇండస్ట్రీ పెద్దలు షిఫ్టుల వారీగా ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అయితే.. తర్వాత పరిస్థితులు సర్దుకున్నాయి. ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య విడుదలకు సిద్ధమయ్యాయి. 12న బాలయ్య మూవీ, 13న చిరు సినిమా థియేటర్లలోకి వస్తున్నాయి.
Advertisement
అయితే.. వీరసింహారెడ్డి సినిమాకు రూ.20, వాల్తేరు వీరయ్య సినిమాకు రూ.25 పెంచుకునేందుకు ఏపీ సర్కార్ అనుమతినిచ్చింది. టికెట్ రేట్ పై అదనంగా ఈ మొత్తం అమలవుతుంది. జీఎస్టీ పెంపు సపరేట్. పెంచిన ధరలు రిలీజ్ డేట్ నుంచి పదిరోజుల పాటు ఉండనున్నాయి. ఈ రెండు సినిమాలకు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతగా ఉంది. కాబట్టి ఇది ఆ సంస్థకు గుడ్ న్యూస్ లాంటిది. ఎందుకంటే సినిమా టికెట్ల రేట్లు తక్కువగా ఉన్న సమయంలో చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
Advertisement
ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రెండు మూవీలకు తెలంగాణలో 6 షో లకు పర్మిషన్ ఇచ్చింది. ఈ సినిమాలు విడుదల అయిన రోజున ఉదయం 4 గంటల నుంచే షో లు వేసుకోవచ్చు అని పేర్కొంది. ఇలా భారీ క్రేజ్ ఉన్న ఈ రెండు సినిమాలకు తెలంగాణ సర్కార్ 6 షో లకు పర్మిషన్ ఇవ్వడంతో కలెక్షన్లు లభించే అవకాశాలు ఉన్నాయి. మరి ఇవి ఏ రేంజ్ కలెక్షన్లను అందుకుంటాయో చూడాలి.
మరోవైపు వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలపై మాజీ మంత్రి లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘‘సంక్రాంతికి ప్రేక్షకులకు వినోదం పంచేందుకు వీర సింహారెడ్డిగా వస్తున్న బాల మావయ్య, వాల్తేరు వీరయ్యగా వస్తున్న చిరంజీవి గారికి శుభాకాంక్షలు.. అలరించే పాటలు, ఆలోచింపజేసే మాటలు, ఉర్రూతలూగించే డ్యాన్సులతో పూర్తిస్థాయి వినోదం అందించే ఈ చిత్రాలను కోట్లాది ప్రేక్షకులలో ఒకడిగా నేనూ చూడాలని తహతహలాడుతున్నా.. హీరోల పేరుతో, కులాల పేరుతో ఫేక్ పోస్టులు సృష్టించి.. విద్వేషాలు రెచ్చగొట్టేందుకు అధికార పార్టీ సన్నద్ధమైంది. ఇద్దరు అగ్రహీరోల సినిమాలు విడుదలవుతున్న సందర్భాన్ని వాడుకుని సోషల్ మీడియాలో ఫేక్ ఖాతాల ద్వారా ఒక కులం పేరుతో మరో కులంపై విషం చిమ్మాలని కుట్రలు పన్నుతోంది’’ అని ట్వీట్ చేశారు లోకేష్.