Advertisement
Narakasura Review: నరకాసుర” సినిమా ఆంధ్ర ప్రదేశ్ మరియు తమిళనాడు సరిహద్దులో కాఫీ మరియు మిరియాల ఎస్టేట్ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమా సెబాస్టియన్ నోహ్ అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించిన తెలుగు యాక్షన్ ఫాంటసీ డ్రామా చిత్రం.
Advertisement
ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా సినిమా చివరివరకు ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఎఐఎస్ నౌఫల్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రానికి నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ అందించగా, సిహెచ్ వంశీ కృష్ణ ఎడిటింగ్ చేశారు. సుముఖ క్రియేషన్స్ బ్యానర్‌పై డా. అజ్జ శ్రీనివాస్, కారుమూరు రఘు ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమాలో శివ ఓ ట్రక్ డ్రైవర్ మరియు మిరియాల పంట హార్వెస్టర్. అతను అదృశ్యం అవడం చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. అనేక ట్విస్ట్ లతో కథ రసవత్తరంగా మలుపులు తిరుగుతుంది. ఓ నిరంకుశ ట్రాన్స్ జెండర్ పరిపాలించే రాజ్యంలోకి శివ అనుకోకుండా వెళ్తాడు.
అసలు ఇదే ఓ ట్విస్ట్. అక్కడి పరిస్థితులు అన్నిటిని శివ ఎలా ఎదుర్కొంటాడు అనేది మరిన్ని ట్విస్ట్ లతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. సామాజిక నియమాలు మరియు అవగాహనల గురించి ఈ సినిమా అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఇక్కడ వేర్వేరు ప్రపంచాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఒకరి హక్కుల కోసం మరొకరు పోరాడటానికి తమ విభేదాలను పక్కన పోరాడాల్సి ఉంటుంది.
Advertisement
రక్షిత్, అపర్ణ జనార్దన్ మరియు నాజర్ లు కీలక పాత్రలను పోషించారు. శివ గా రక్షిత్ అద్భుతమైన నటనను కనబరిచారు. ఇక అపర్ణ జనార్దన్ కూడా చాలా లోతైన పాత్రలో నటించి మెప్పించారు. దర్శకుడు సెబాస్టియన్ నోహ్ అకోస్టా జూనియర్ ఓ వైపు సాంఘిక అంశాలను ప్రస్తావిస్తూనే సినిమాను చాలా రసవత్తరంగా తీర్చిదిద్దారు. సెన్సిటివ్ సబ్జెక్ట్‌లను డెప్త్‌గా, సెన్సిటివిటీతో చిత్రీకరించడంలో దర్శకుడి సామర్థ్యానికి ఈ సినిమా నిదర్శనంగా నిలుస్తోంది.
కాఫీ మరియు పెప్పర్ ఎస్టేట్ యొక్క సెట్టింగ్ కూడా చాలా అందంగా ఆహ్లాదంగా కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, సౌండ్ ట్రాక్ లు ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.
మరిన్ని..
Vidhi Movie Telugu Review: విధి మూవీ రివ్యూ ఇదే.. సినిమా హిట్టా? ఫట్టా?