Advertisement
ప్రధాన నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానంగా ఎన్నికయ్యారు ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో మొదటిసారి ఎంపీగా గెలిచారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత 2019 ఎన్నికల్లో కూడా గెలిచి రెండవ సారి ప్రధాని అయ్యారు. 2024 ఎన్నికల్లో కూడా విజయాన్ని అందుకుని హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ప్రధాన నరేంద్ర మోడీ జీతం ఎంత అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని నరేంద్ర మోడీకి నెలకు 1.6 లక్షల జీతం వస్తుంది ఇందులో రూ.50,000 బేసిక్ పే.
Advertisement
వీటికి అదనంగా ఖర్చులు కింద రూ.3000 చెల్లిస్తారు అంతేకాకుండా నియోజకవర్గ అలవెన్స్ కింద 45000 ఇస్తారు. రోజువారి అలవెన్స్ కింద రెండు వేలు తీసుకుంటారు. ఆఫీస్ ఖర్చుల కింద నెలకు 6000 వస్తాయి. అంతేకాకుండా ఆయన ఎంపీగా కూడా ఉంటారు కనుక రోజు వారి అలోవెన్స్ కింద రూ.3000 వస్తాయి. ఇంటి నుండి బయటకు వెళ్తే రోజుకి రూ.3000 అలవెన్స్ ఉంటుంది. వీటితో పాటుగా ప్రభుత్వ భవనాన్ని నివాస సౌకర్యం కల్పిస్తారు టెలిఫోన్ సహా ఇతర సదుపాయాల్ని మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. నరేంద్ర మోడీ ప్రయాణాలు ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది.
Advertisement
Also read:
ప్రధాన మంత్రి రక్షణ బాధ్యతను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్ పి జి అనుక్షణం పర్యవేక్షిస్తుంది. ప్రధాన మంత్రి కుటుంబ సభ్యులు కలిసి ఉండేందుకు లగ్జరీ ఇంటిని అధికారిక నివాసంగా కేటాయిస్తారు. న్యూఢిల్లీలో ప్రధాని ఉంటారు. ప్రధాన మంత్రికి అధికారిక కార్లు విమానాల్లో ప్రయాణించే వీలు కూడా ఉంటుంది అలాగే ఆయనతో పాటుగా ఆయన కుటుంబ సభ్యులకి కూడా మెడికల్ సదుపాయాలు ఇస్తారు. పెన్షన్ విషయానికి వస్తే ఎన్నేళ్లపాటు ప్రాథమిక సేవలు అందించారు దాన్ని బట్టి నెలకు ఎంత పెన్షన్ ఇవ్వాలి అనేది ఉంటుంది. ఇలా ప్రధానమంత్రికి జీతం తో పాటుగా ఇతర బెనిఫిట్స్ ని ఇస్తారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!