Advertisement
తెలుగు ప్రేక్షకులకు సీనియర్ హీరో నరేష్ గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఈ మధ్యకాలంలో నరేష్ సినిమాల కంటే వ్యక్తిగత కారణాలవల్లే ఎక్కువగా వైరల్ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నరేష్ – పవిత్రల వ్యవహారం మీద వచ్చిన వార్తలు, కామెంట్లే కనిపిస్తున్నాయి. 1972 వ సంవత్సరంలో పండంటి కాపురం చిత్రంతో బాల నటుడిగా కెరీర్ ని ప్రారంభించారు నరేష్. ఇండస్ట్రీలో హాస్యాన్ని కొత్త కోణంలో చూపించిన హాస్యనటుడు నరేష్. 80, 90 దశకాలలో తెలుగు ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసిన టాలెంటెడ్ హీరో. ఇక నరేష్ వ్యక్తిగత జీవితానికి వస్తే ఈయన మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదట సీనియర్ కెమెరామెన్ అయిన శ్రీను కుమార్తెను వివాహం చేసుకున్నారు నరేష్. వీరికి ఒక కుమారుడు కూడా జన్మించారు.
Advertisement
Advertisement
ఆ తర్వాత మనస్పర్ధల కారణంగా మొదటి భార్యతో నరేష్ విడిపోయారు. ఇక నరేష్ రెండో భార్య బయట ప్రపంచానికి ఎక్కువగా పరిచయం లేదు. ఆమె పేరు రేఖ సుప్రియ. ఈమె ఎంతో ఉన్నతమైన కుటుంబంలో జన్మించింది. ఈమె ఎవరో కాదు ప్రముఖ గేయ రచయిత, అభ్యుదయ వాది అయిన దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రికి మనవరాలు. అంతేకాక బుజ్జాయి రచయిత అయినటువంటి సుబ్బరాయ శర్మకు కుమార్తె. నరేష్ తన మొదటి భార్యతో ఉన్నప్పుడే రేఖా సుప్రియ తో పరిచయం ఏర్పడి మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రేఖ సుప్రియని పెళ్లి చేసుకున్నారు. రేఖ సుప్రియ తండ్రి సుబ్బరాయ శర్మకు, విజయనిర్మలకు మంచి స్నేహం ఉండేది. అందుకే నరేష్ కి పెళ్లి చేయాలని ఆమె కోరుకుంది. ఇక పెళ్లి జరిగాక చాలా రోజులు వీరిద్దరూ బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు. మొదటి బాబు పుట్టినప్పుడు బాగానే ఉన్నప్పటికీ రెండో బాబు ఆటిజం అనే సమస్య తో పుట్టడం వల్ల ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో నరేష్, రేఖ సుప్రియ విడిపోవాల్సి వచ్చింది.
అయితే మొదటి కొడుకు నవీన్ కస్టడీ కోరుతూ నరేష్ కేసు వేయడంతో అతడు తన తండ్రి దగ్గర ఉండాల్సి వచ్చింది. ఇక చిన్నపిల్లోడిని మాత్రం రేఖ సుప్రియ దగ్గరఉండి పెంచింది. తన చిన్న కొడుకుని రేఖ సుప్రియ ఎంతో పెద్ద చదువులు చదివించింది. ప్రస్తుతం ఆయన పెయింటర్ గా పనిచేస్తున్నారు. ఆయన వేసిన పెయింటింగ్స్ కొన్ని లక్షల్లో అమ్ముడు పోతాయి. ఇలా తన కొడుకుని ఆ సమస్య నుంచి బయట పడేయడమే కాకుండా ఎంతో మందికి భవిష్యత్తు కల్పిస్తుంది రేఖ. అలాంటి వ్యాధితో బాధపడుతున్న మరో 25 మందిని కూడా రేఖ సుప్రియ దత్తత తీసుకొని వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకుంటుంది. అలాగే ఆటిజం తో బాధపడుతున్న వారి కోసం ఒక ఆర్గనైజర్ ని కూడా ప్రారంభించింది. ఈ విషయం తెలిసిన చాలా మంది రేఖా సుప్రియ చాలా మందికి ఆదర్శం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read also: పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చింది.. వాళ్ల పిల్లనే వల్లో పడేసి భార్యగా.. ట్విస్ట్ ఏంటంటే..?