Advertisement
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి పాపులారిటీని తెచ్చుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో పాటు సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని నాటు నాటు పాట సూపర్ హైలైట్ అయింది. ఇప్పటికే ఈ పాట ఆస్కార్ క్వాలిఫికేషన్ లిస్టు లోకి కూడా ఎంట్రీ అయింది. ఇక ఆస్కార్ తర్వాత ఉన్న గోల్డెన్ గ్లోబ్ అవార్డుని ఇటీవలే నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ విభాగంలో సొంతం చేసుకుంది. దీంతో నాటు నాటు పాట మరింత పాపులర్ అయింది. ఆసియా నుండి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న తొలి పాట ఇదే కావడం విశేషం. ఈ పాటకి సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ అవార్డును అంతర్జాతీయ వేదికపై అందుకున్నారు. అయితే ఈ పాట కోసం చిత్ర యూనిట్ ఎంతగానో కష్టపడిందట.
Advertisement
ఈ పాటని ఎలా మొదలు పెట్టాలో అని ఆలోచించినప్పుడు కీరవాణి కి మొదట గుర్తొచ్చిన పేరు చంద్రబోస్. కీరవాణి స్వరపరిచిన ఎన్నో పాటలకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. అయితే రామ్ చరణ్, తారక్ ఇద్దరు బెస్ట్ డాన్సర్ల కోసం మాస్ సాంగ్ కు చంద్రబోస్ అయితేనే న్యాయం చేస్తాడని కీరవాణి ఆయనని పిలిపించారట. 1920 ప్రాంతంలోని కథకి తగిన మాటలు వాడాలి కాబట్టి చంద్రబోస్ రెండు రోజుల్లో మూడు పల్లవులను రాసుకొని కీరవాణి ముందు ఉంచాడట. “పొలం గట్టు”తో సాగే పల్లవిని రాజమౌళి కీరవాణి లు ఓకే చేశారు. అందులో నా పాట చూడు అనే పదానికి ముందు చంద్రబోస్ నా పాట పాడు అనే పదాన్ని రాశాడట. దానిని కీరవాణి నా పాట చూడు గా మార్చారు. ఈ పాట 90% పూర్తయిపోయినప్పటికీ, ట్యూన్ కూడా సిద్ధమైనప్పటికీ మార్పులు చేర్పులు చేస్తూ ఈ పాటని పూర్తి చేయడానికి 19 నెలల సమయం పట్టిందట. ఆ తర్వాత ఈ పాత్రను చిత్రీకరించడానికి మూవీ యూనిట్ ఉక్రెయిన్ వెళ్ళింది.
Advertisement
అక్కడ ఈ పాత్రను చిత్రీకరిస్తున్న సమయంలో రాజమౌళికి ఏదో అసంతృప్తిగా అనిపించి వెంటనే చంద్రబోస్ కి కాల్ చేసి మరికొన్ని మార్పులు చేయవలసిందిగా కోరాడట. దాంతో 15 నిమిషాలలోనే చంద్రబోస్ మరో రెండు లైన్లను మార్చి అందించినట్టుగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు చంద్రబోస్. ఇక ఈ పాట కోసం ప్రేమ్ రక్షిత్ ఏకంగా 95 స్టెప్పులను కంపోజ్ చేశాడు. రామ్ చరణ్ – తారక్ ఒకరి భుజంపై ఒకరు చేతులు వేసుకొని చేసిన హూక్ స్టెప్పు కోసం ఏకంగా 30 స్టెప్పులు రెడీ చేశాడు. ఇలా ఈ పాట కోసం ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం చిన్నపాటి యుద్ధమే చేసింది. అలా ఈ పాటలోని పదాలను మారుస్తూ రాసి, రాహుల్ సిప్లిగంజ్ తో పాడించి, పాటను కంపోజ్ చేసి, చిత్రీకరించే వరకు దాదాపు 20 నెలల సమయం పట్టిందట. చిత్ర బృందం అంత కష్టపడింది కనుకే ఈ పాటకు ఇప్పుడు గ్లోబల్ గా ప్రశంసలు దక్కుతున్నాయి.
Read also: మొదటి సినిమాతో హిట్ కొట్టేసి, కనపడకుండా కనుమరుగైన 6 స్టార్ హీరోయిన్స్ !