Advertisement
మనం వివిధ దేవుళ్ళని ఆరాధిస్తూ ఉంటాము. దేవుళ్ళని ఆరాధించడానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఎలా అయితే మనం పూజించాలో అలానే పూజించాలి అప్పుడే మంచి జరుగుతుంది. ఒకవేళ మనకి ఎంత భక్తి ఉన్నా సరిగ్గా మనం పూజ చేయకపోతే అది వృధానే. దాని వలన ఫలితం ఏమీ ఉండదు. అయితే మనిషి జీవితం పై నవగ్రహాల ప్రభావం ఉంటుందన్న విషయం మనకు తెలుసు. ఈ గ్రహాల ప్రభావం వలన మంచి చెడు చోటు చేసుకుంటూ ఉంటాయి.
Advertisement
Advertisement
అందుకే చాలామంది నవగ్రహాలని ఆరాధిస్తూ ఉంటారు. నవగ్రహాల పూజకి కూడా ఒక విధివిధానమనేది ఉంటుంది. నవగ్రహ మూర్తులు ముఖ్యంగా శివాలయాల్లో ఉంటారు ఎప్పుడైనా ఆలయానికి వెళ్లే ముందు నవగ్రహాలని నమస్కరించుకుని ఆ తర్వాత ఆఖరి ని గర్భాలయంలో ఉన్న మూలవిరాట్ని దర్శించుకోవాలి. నవగ్రహాల చుట్టూ తొమ్మిది కానీ 11 కానీ ప్రదక్షిణాలు చేస్తే మంచిది. శక్తి లేకపోతే మూడు ప్రదిక్షణలు చేసినా పరవాలేదు. నవగ్రహాలకి అధినాయకుడు సూర్యుడు. ముందు ఆయనని తలుచుకుని తర్వాత చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు శుక్రుడు, శని రాహుకేతువులని దర్శనం చేసుకోవాలి.
Also read: