Advertisement
తెలంగాణలో సంచలనంగా మారిన నవీన్ హ*** కేసు మరింత ఆసక్తికరంగా మారింది. ప్రియురాలి కోసం ప్రాణ స్నేహితుడిని అతికిరాతకంగా చంపాడు నిందితుడు హరిహరకృష్ణ. అయితే ఈ కేసులో కేవలం హరిహరకృష్ణ ఒక్కడే నిందితుడా, లేదా ఇంకెవరి పాత్ర అయినా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. హ*** తర్వాత ఈ విషయాన్ని నిందితుడు ఎవరెవరితో పంచుకున్నాడో వాళ్లను విచారించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఈ కేసులో హరిహర కృష్ణ ఏ1గా, హసన్ ను ఏ2 గా అలాగే నిహారికను ఏ3గా పోలీసులు గుర్తించారు.
Advertisement
Read also: మన స్టార్ హీరోయిన్స్ పెళ్లి చేసుకునే సమయానికి వీరి ఏజ్ ఎంతంటే ?
అయితే నవీన్ హత్య కేసులో ఏ3 ముద్దాయిగా ఉన్న హరిహర కృష్ణ ప్రియురాలు నిహారిక పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించింది. నవీన్ కేసులో దొరికే ఛాన్స్ లేదని హరి చెప్పాడు. దీంతో హరిని నమ్మాను అని పోలీసులతో నిహారిక వివరించింది. తాను, నవీన్ ఇంటర్ నుంచి ప్రేమించుకున్నామని, తమ ఇంట్లోనే ఇద్దరం కలుసుకునే వాళ్ళమని చెప్పింది. నవీన్ తాను గొడవ పెడితే హరిహర కృష్ణ సర్దిచెప్పేవాడని, ఇద్దరి మధ్య తనే మధ్యవర్తిగా ఉండేవాడిని వెల్లడించింది. తాను నవీన్ విడిపోయాక హరి తనను ప్రేమిస్తున్నానని చెప్పానని వెల్లడించింది.
Advertisement
అంతేకాక తరచుగా నవీన్ నీ చంపేసి, తనను కిడ్నాప్ చేసి తీసుకెళ్తానని అనేవాడని, తాను మందలిస్తే ఊరికే సరదాగా అన్నానని చెప్పేవాడని యువతి పోలీసులకు తెలిపింది. అంతేకాక హరి, నవీన్ ను హ* చేయడానికి వాడిన కత్తులు, రెండు గ్లాసులు తనకు చూపించాలని యువత వెల్లడించింది. నవీన్ హ* తర్వాత తను నాలుగు సార్లు హరిని కలిశానని తెలిపింది. హ* విషయం గురించి తనకు తెలిసినా కావాలని పోలీసులకు, ఫ్రెండ్స్ కు చెప్పలేదని వెల్లడించింది. ఈ కేసులో తాము దొరికే అవకాశం లేదని హరి తనతో చెప్పాడని, అతని మాటలు నమ్మానని యువతి వెల్లడించింది. నవీన్ హ* తర్వాత తాము వనస్థలిపురం ప్రాంతంలో మూడుసార్లు కలిసామని ఒప్పుకుంది. హ** తర్వాత హరికి 1500 రూపాయలు ఇచ్చి పారిపోయేందుకు సహకరించానని యువతి అంగీకరించింది.
Read also: అన్ని సినిమాలు, ఒకటే పాత్ర! ఈ వ్యక్తిని గుర్తుపట్టారా? అతను ఎవరంటే?