Advertisement
హైదరాబాద్ లో ఓ వార్త సంచలనంగా మారింది. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కథలకు ఏమాత్రం తీసిపోని ఈ ఘటన చూసి అందరూ షాక్ కు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని మూసారాంబాగ్ కు చెందిన హరిహర కృష్ణ.. ఫిర్జాదీగూడలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. అలాగే, నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వ విద్యాలయంలో నవీన్ కూడా బీటెక్ లాస్ట్ ఇయర్ చదువుతున్నాడు. వీళ్లిద్దరు దిల్ సుఖ్ నగర్ లోని ఓ జూనియర్ కాలేజీలో చదువుకునే సమయంలో స్నేహితులయ్యారు.
Advertisement
అయితే.. ఈనెల 21న కాలేజ్ కి వెళ్తున్నట్టు ఇంట్లో అక్క బావలకు చెప్పిన హరి.. ఆరోజు సాయంత్రం నుంచి రాలేదు. రెండ్రోజులైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు కంగారు పడ్డారు. హరి కనిపించలేదంటూ ఈనెల 23న మలక్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మలక్ పేట్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో 24న పోలీసులకు లొంగిపోయాడు హరిహర కృష్ణ. ఏం జరిగింది? ఎక్కడికి వెళ్లావు? ఇన్ని రోజులు ఏం చేశావు? అని విచారించగా.. నవీన్ మర్డర్ స్టోరీని రివీల్ చేశాడు.
ఈనెల 17న నవీన్ కు ఫోన్ చేసిన హరి.. హైదరాబాద్ కు రావాల్సిందిగా కోరాడు. స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుందామని సూచించడంతో నల్గొండ నుంచి ఉదయం వచ్చాడు. ఇద్దరూ కలిసి స్కూటీపై ఇంటర్ స్నేహితుడి దగ్గరికి వెళ్లారు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి భోజనం చేసి సినిమాకు వెళ్లారు. ఆ స్నేహితుడు తన ఇంటికి వెళ్లిపోగా.. నవీన్ ను మూసారాంబాగ్ లోని తన ఇంటికి తీసుకెళ్లాడు హరి. తర్వాత నల్గొండ వెళ్తానని నవీన్ చెప్పగా.. ద్విచక్ర వాహనంపై ఇద్దరూ బయల్దేరారు. ఎల్బీనగర్ మీదుగా అబ్దుల్లాపూర్ మెట్ వైపు వెళ్లారు. నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లాక.. ఇద్దరూ కలిసి మద్యం సేవించారు.
Advertisement
ఈక్రమంలోనే ఒకే అమ్మాయి గురించి ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. ఒకరినొకరు నెట్టుకున్నారు. తోపులాటలో కిందపడిపోయిన నవీన్ పై కూర్చున్న హరి గొంతు నులిమి చంపేశాడు. చనిపోయాడని నిర్ధారించుకుని తర్వాత.. తన వెంట తెచ్చుకున్న కత్తితో నవీన్ తల, మొండెం వేరు చేశాడు. ఆ తర్వాత గుండె చీల్చి.. పొట్ట భాగాన్ని పెకిలించి పేగులు బయటకు తీశాడు. మర్మాంగాన్ని కోశాడు. తన ప్రియురాలితో నవీన్ చనువుగా ఉంటున్నాడన్న అక్కసుతోనే హరి ఈ ఘోరానికి పాల్పడ్దాడు.
రోండు రోజులైనా నవీన్ ఇంటికి రాకపోవడంతో హరిహరకు ఫోన్ చేశాడు తండ్రి శంకర్. ఆరోజే తన దగ్గర నుంచి వెళ్లిపోయాడని చెప్పాడు. 21న హరిహరకు మళ్లీ ఫోన్ చేసిన నవీన్ తండ్రి… హైదరాబాద్ వస్తున్నామని చెప్పాడు. నగరానికి చేరుకున్న తర్వాత గంటలో వస్తున్నానని దిల్ సుఖ్ నగర్ లో వేచి ఉండండని చెప్పిన హరి ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ చేసి పెట్టుకున్నాడు. దీంతో శంకర్.. నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్లో 21 సాయంత్రం ఫిర్యాదు చేశారు. 22న మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు, నవీన్ కాల్ డేటాను సేకరించారు. చివరగా హరిహర కృష్ణ నెంబర్ కు ఫోన్ వచ్చినట్లు గుర్తించి ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. 22నే పోలీసులు నిందితుడి ఇంటికి వెళ్లారు. ఇంట్లో అతను లేకపోవడంతో తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు.
ఆ తర్వాత, నిందితుడు 24న పోలీసులకు లొంగిపోయాడు. జరిగిందంతా చెప్పాడు. ఘటనా స్థలానికి తీసుకెళ్లి ఏం చేశాడో వివరించాడు. నవీన్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. నవీన్ ను చంపి అతని అవయవాలను కోసేసిన తర్వాత యువతిని మెసేజ్ పెట్టాడు హరి. దానికి ఆమె.. లైట్ తీస్కుంటూ రిప్లై ఇవ్వడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్య విషయంలో.. ఆమె పాత్రపై ఆరా తీస్తున్నారు. ఈ మర్డర్ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ వద్ద ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చేతికొచ్చిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.