Advertisement
ఏపీ టెన్త్ పరీక్షల్లో బాలికలదే హవా. ఏపీ రాష్ట్రం లో ఏలూరు కి చెందిన విద్యార్థిని మనస్వి కి 600 కి 599 మార్కులు వచ్చాయి. సోషల్ మీడియాలో ఆ వార్త విపరీతంగా వైరల్ అయింది. ఇది ఇలా ఉంటే ఉమ్మడి కర్నూలు జిల్లా లోని చిప్పగిరి మండలం కి చెందిన నవీన అనే ఒక విద్యార్థిని మూడు రోజులు కూలి పని చేసుకుంటూ చదువుకునేవారు. ఆమె కి టెన్త్ పరీక్షల్లో 509 మార్కులు వచ్చాయి. చెప్పగిరి మండలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో మార్కులు చూసినట్లయితే ఆమెకే ఎక్కువ మార్కులు వచ్చాయి.
Advertisement
కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక ఆమె మూడు రోజులు కూలి పనికి వెళ్ళేది మిగిలిన రోజులు చదువుకునేది. నవీన తల్లి కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు జీవనాన్ని సాగిస్తున్నారు. నవీన మార్కులు చూసి అంతా కూడా ఈమె ని మెచ్చుకుంటారు. నవీన కూలి పనికి వెళ్లకుండా ఉండి ఉంటే ఇంకా ఎక్కువ మార్కులు వచ్చేవని అందరూ అంటున్నారు.
Also read:
Advertisement
Also read:
భవిష్యత్తు లో ఎవరైనా ఆమెకి ఆర్థికంగా సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా ఆమె మంచి పొజిషన్లోకి వెళుతుందని అంటున్నారు. విద్యార్థులకి నవీన వంటి విద్యార్థులకు రాజకీయ నేతలు సపోర్ట్ ఉంటే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. టెన్త్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన నవీన ని అందరూ అభినందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల లో చదివి ఈ స్థాయి లో మార్కులు తెచ్చుకోవడం గొప్ప విషయం అని మెచ్చుకుంటున్నారు. నవీన వంటి మట్టి లో మాణిక్యాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారాలు అందాలని భవిష్యత్తు లో మంచి స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!