Advertisement
JEE పరీక్ష రాసే ప్రతిష్టాత్మక ఐఐటీలో చదవాలని అనుకునే విద్యార్థులు చాలా మంది ఉంటారు కానీ అందరికీ అంత అవకాశం రాదు. చాలామంది సక్సెస్ అవ్వడానికి మంచి కాలేజీలో సీటు రావడానికి కోచింగ్ తీసుకొని మరీ పరీక్ష రాస్తుంటారు అయినా ఇప్పటికే కొంతమందికి మాత్రమే సక్సెస్ అందుతుంది బానోతు నవ్య ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివి ఐఐటి సాధించడం ద్వారా వార్తల్లో నిలిచారు. నవ్య ఖమ్మం జిల్లాలో కూసుమంచి మండలం గంగబండ తండాకు చెందిన విద్యార్థి.
Advertisement
వ్యవసాయంతో జీవనాన్ని సాగించే గిరిజన కుటుంబంలో పుట్టారు. నాలుగో తరగతి దాకా నవ్య మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నారు ఐదవ తరగతి నుండి ఇంగ్లీష్ మీడియం లో చదివిన నవ్య పదవ తరగతిలో 9.5 జిపిఎస్ సాధించారు. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో చేరిన నవ్య ఇంటర్ ఎంపీసీ విభాగంలో చేరి 964 మార్కులు సాధించింది, JEEకి సంబంధించిన శిక్షణ తీసుకున్న నవ్య ఒకవైపు చదువుకు మరోపక్క ప్రాధాన్యత ఇచ్చింది.
Advertisement
Also read:
ఇంటర్ పూర్తయ్యాక రోజుకు 16 గంటల పాటు ప్రిపరేషన్ సాగించిన ఈమె లెక్చెరర్ల సహాయంతో మెలకువలు నేర్చుకుంది. ఎస్టి వి భాగంలో ఆమెకి 1251 ర్యాంకు వచ్చింది. నవ్య ప్రతిభను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పొచ్చు. మాస్టర్ సుమతి ప్రోత్సాహాన్ని అస్సలు మర్చిపోలేని ఆమె చెప్పారు. ఐఐటి బాంబేలో మెటలాజికల్ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్ సైన్స్ ఎంచుకున్నానని ఆమె చెప్పింది. కుటుంబ సభ్యుల నమ్మకాన్ని నిలబెట్టడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె అంది.