Advertisement
లేడీ సూపర్ స్టార్ అంటే సినీ ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. అంతలా పేరు సంపాదించుకుంది కోలీవుడ్ భామ నయనతార. దక్షిణాది సినిమాల్లో నటిస్తూ తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి నిలదొక్కుతుంది. టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమా ‘చంద్రముఖి’ తో తెలుగుపేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత పూర్తి హీరోయిన్ గా వెంకటేష్ తో కలిసి నటించిన చిత్రం ‘లక్ష్మి’. ఆ సినిమా హిట్ కావడంతో టాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చాయి.
Advertisement
ఇక ఇటీవలే నయనతార-విగ్నేష్ శివన్ పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. అంతేకాదు జూన్ లో పెళ్లి జరిగితే, ఇద్దరు కవలలు పుట్టారంటే పోస్ట్ పెట్టడంతో అంతా ఉలిక్కిపడ్డారు. అయితే సరోగసి అని క్లారిటీ రాగానే అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మళ్ళీ సరోగసి బ్యాన్ అనగానే ఇంకో రచ్చ మొదలైంది. అయితే ఈ వివాదం వల్ల వాళ్లకి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది అనే విషయం వెలుగు చూసింది. తగిన ఆధారాలు చూపించి నయనతార దంపతులు ఆ వివాదం నుంచి బయటపడ్డారు. ఇప్పుడు ఈ జంట మరోసారి వైరల్ అయింది.
Advertisement
అయితే నయన్-విగ్నేష్ వైరల్ కావడానికి కారణం విగ్నేష్ తల్లి. కొత్త కోడలిపై అత్త చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. కోడలిని తన పొగడ్తలతో అత్త ఆకాశానికి ఎత్తేశారు. “మా అబ్బాయి మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్, నా కోడలు ఓ స్టార్ హీరోయిన్. వాళ్ళు ఇద్దరు కష్టపడే వ్యక్తిత్వం కలవారే. నా కోడలు అయితే చాలా మంచి మనస్తత్వం చాలా అమ్మాయి. వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళలో ఒక్కళ్ళు రూ. 4 లక్షల అప్పు తీర్చలేక ఎన్నో ఇబ్బందులు పడుతుండగా, ఆ విషయం తెలుసుకుని వాళ్ళ అప్పు తీర్చేసింది. 10 మంది మనుషులు చేసే పనిని నయనతార ఒక్కతే చేస్తుంది. ఇల్లుని చక్కదిద్దుకోవడం, పెద్దవాళ్ళను చూసుకోవడం ఆమెకు బాగా తెలుసు. ఇద్దరికీ వారి వృత్తి అంటే అపారమైన గౌరవం. వాళ్ళ వృత్తిలో ఉన్నత శిఖరాలను అందుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తారు” అంటూ కోడలిని ఆకాశానికి ఎత్తేశారు.