Advertisement
ఇటీవల జూన్ 9వ తేదీన మహాబలేశ్వరం లోని షెరటాన్ గ్రాండ్ హోటల్ లో చాలా అంగరంగవైభవంగా వివాహం చేసుకున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార అలాగే ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు విగ్నేష్ శివన్. దాదాపు ఏడు సంవత్సరాల ప్రేమాయణానికి పులిస్టాప్ పెడుతూ ఎట్టకేలకు నూతన జీవితంలోకి అడుగు పెట్టారు ఈ జంట. ఇకపోతే వివాహం అనంతరం ఏకంగా లక్ష మంది అనాధ పిల్లలకు భోజనాలు కూడా పెట్టించారు.
Advertisement
ఇకపోతే ఈ వివాహానికి నయనతారా తల్లి అనారోగ్య కారణంగా హాజరు కానందున నవ దంపతులు ఇద్దరు కేరళకు వెళ్లి నయనతార తల్లి దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. హనీమూన్ ట్రిప్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసింది నయనతార. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ కు చేరుకున్న ఈ దంపతులు అక్కడ లగ్జరీ హోటల్ లో ఉన్నట్లు సమాచారం. ఇక పెళ్లైన ఫస్ట్ టూర్ కావడంతో ఈ టూర్ లో వాళ్లు చాలా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నట్లు ప్రచారాలు వస్తున్నాయి.
Advertisement
హనీమూన్ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలు సైతం విగ్నేష్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఇక జీవితంలో గుర్తుండిపోయే లాగా నయనతార ఈ ట్రిప్ కోసం ఏకంగా రూ.2 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు సమాచారం. లగ్జరీ హోటల్స్ తో పాటు అక్కడ బీచ్లో ఎంజాయ్ మెంట్ లు, ఖరీదైన రెస్టారెంట్లు, భోజనాలు మొత్తంగా చూసుకుంటే ఈ ట్రిప్ కోసం ఆమె ఏకంగా రెండు కోట్లు ఖర్చు చేసింది అని చెప్పడంతో ఈ విషయం కాస్త kollywood మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
also read;