Advertisement
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హడావిడి ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కొందరికి ఊహించని విజయం లభిస్తే మరికొందరికి అనుకోని పరాజయం ఎదురైంది. జోరు మీదున్న కారుకి బ్రేకులు పడితే హస్తం గుర్తు పార్టీకి పగ్గాలు లభించాయి.కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి చావుకి, కౌరవుల ఓటమికి వంద కారణాలు ఉన్నట్లే.. బిఆర్ఎస్ పార్టీ పరాజయానికి కూడా బోలెడు కారణాలు కనిపిస్తున్నాయి. అయితే.. సోషల్ మీడియాలో మాత్రం ఓ వార్తా వైరల్ అవుతోంది.
Advertisement
తెలంగాణ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజానే కారణం అన్నది ఈ వార్త సారాంశం. తెలంగాణాలో బి ఆర్ ఎస్ పార్టీ ఓడిపోవడంతో మంత్రి రోజాను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ మంత్రి కేసీఆర్ కు మంత్రి రోజా మద్దతు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బి ఆర్ ఎస్ పార్టీకే ఓట్లు వెయ్యాలి అంటూ ఆమె ప్రజలను రిక్వెస్ట్ చేసారు. అంతటితో ఆగలేదు. కేసీఆర్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుంది అని కామెంట్స్ చేసారు.
Advertisement
బిఆర్ఎస్ కు ముందస్తు శుభాకాంక్షలు చెబుతున్నానని అన్నారు. కచ్చితంగా తెలంగాణాలో బిఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది అని చెప్పుకొచ్చారు. అయితే.. ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యిన సంగతి తెలిసిందే. దీనితో రోజా హేటర్స్ ఆమెకు వ్యతిరేకంగా టార్గెట్ చేసుకుని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. గతంలో వరల్డ్ కప్ సమయంలో కూడా ఇండియా గెలుస్తుంది అని రోజా జోస్యం చెప్పారు. కానీ, అది జరగలేదు. ఇప్పుడు కూడా రోజా బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పడం వల్లే ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది అంటూ రోజక్కని ట్రోల్ చేస్తున్నారు.
Read More:
బీ ఆర్ ఎస్ ఓటమికి ప్రధాన కారణాలు ఇవేనా ? ఈ 5 తప్పులే కొంపముంచాయి ?
సినిమా రీమేక్ కాదు అన్నారు కదా ప్రశాంత్ నీల్ ? మరి ఈ కన్ఫ్యూషన్ ఏంటి ?
ఒకరు సీఎం, మరొకరు కాబోయే సీఎం ఈ ఇద్దరినీ ఓడించిన ఈయన ఎవరో తెలుసా ?