Advertisement
ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని నోవొటెల్ లో జరగాల్సిన ఈవెంట్ అభిమానుల భారీ తకిడి కారణంగా రద్దు చేశారు. నోవొటెల్ కెపాసిటీ 3000 కానీ సుమారు పదివేల మంది అభిమానులు అక్కడికి వచ్చారు. ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయడానికి సిబ్బంది ఎంతో కష్ట పడింది. లోపలికి అనుమతించకపోవడంతో ఆగ్రహించిన ఫ్యాన్స్ హోటల్ అద్దాలు ధ్వంసం చేశారు. ఫర్నిచర్ ని కూడా ధ్వంసం చేశారు. ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా రావడంతో పాన్ ఇండియా మూవీ కూడా అవ్వడంతో తారక్ ఫ్యాన్స్ ఆయన్ని కలవడానికి భారీగా వచ్చారు.
Advertisement
కానీ ఇక్కడ లిమిటేషన్స్ పెట్టడంతో సహనాన్ని కోల్పోయారు. దేవర టీం కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. పైగా పరిమితికి మించి పాస్ లు అమ్మడం కూడా ఇందుకు కారణం. దీనిపై స్పందించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సారీ చెప్తూ వీడియో విడుదల చేశారు. తానే ఎక్కువగా బాధపడతానని ఈనెల 27న థియేటర్లలో కలుద్దామని చెప్పారు.
Advertisement
Also read:
దేవర సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదనే విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ఇది మరింత నిరాశపరిచే వార్తగా చెప్పొచ్చు. ఇంకో సెంటిమెంట్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు ఆడలేదు. తండ్రి కొడుకులుగా చేసిన సినిమాలు ఆడలేదు. ఆంధ్రావాలా, శక్తి లో అలానే కనిపిస్తారు. దేవరలో కూడా తండ్రి కొడుకులు గానే కనబడతారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!