Advertisement
చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆయన కట్టించిన రాజమండ్రి జైల్లోనే శిక్షని అనుభవిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు స్క్వాష్ పిటీషన్ తో పాటు బెయిల్ కోసం హై కోర్ట్ లో అప్లై చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు పై ఉన్న కేసుల విచారణ జరగనుంది. ఇప్పటికే నందమూరి బాలకృష్ణతో సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై స్పందించారు.
Advertisement
కానీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు ఈ విషయమై స్పందించలేదని కొంతమంది టీడీపీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కొందరు చేస్తున్న ఈ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. కొంతమంది శృతి మించి కామెంట్స్ చేస్తున్నారు. ఇకపై ఎన్టీఆర్ సినిమాలు చూసేది లేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి కామెంట్స్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం గట్టిగానే సమాధానాలు ఇస్తున్నారు.
Advertisement
అసలు ఎన్టీఆర్ స్పందించకపోతే వచ్చే నష్టం ఏంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గత కొన్నేళ్లలో నందమూరి తారక్ చాలా సార్లు రాజకీయ విషయాల్లో అవమానాలు ఎదుర్కొన్నారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆవేదనగా కామెంట్స్ చేశారు. ఆ సమయంలో మీరంతా ఎక్కడకి పోయారు? అంటూ ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు. పలు సార్లు తారక్ స్పందించినా.. ఆ సమయంలో తారక్ ని చాలా దారుణంగా ట్రోల్ చేసారని.. ఇప్పుడు స్పందించలేదని ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అభిమానులు తారక్ ని టీడీపీ తన అవసరాలకు వాడుకుంటోందని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.