Advertisement
చివరివరకు రసవత్తరంగా సాగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో ఫైనల్స్ కి వచ్చేసరికి భారత్ తడపడిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్ టీం తడబడే సరికి ఆ ఒత్తిడి బౌలర్లపై కూడా పడింది. బౌలర్లు చేతులెత్తేసరికి విజయం ఆస్ట్రేలియా ని వరించింది. అయితే.. ఈ క్రమంలో మాక్స్ వెల్ భార్య విని రామన్ ఆస్ట్రేలియా జట్టుకి అభినందనలు తెలిపారు. దీనితో నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేయడం స్టార్ట్ చేసారు. ఒక ఇండియన్ వి అయ్యుండి.. వారికి అభినందనలు చెబుతావా అంటూ ప్రశ్నిస్తున్నారు.
Advertisement
Advertisement
అయితే.. ఈ ట్రోల్స్ పై విని రామన్ ఘాటుగానే స్పందించింది. “చాలా దారుణంగా మెసేజులు చేస్తున్నారు. అసలు వీటికి స్పందించడమే ఆశ్చర్యంగా ఉంది. నేను భారతీయురాలినే. అయితే.. నేను పుట్టిన పెరిగిన దేశం ఆస్ట్రేలియా. నేను పుట్టి పెరిగిన దేశాన్ని పొగడడానికి, ఇంకా.. నా భర్త, నా బిడ్డకి తండ్రి ఆడుతున్న జట్టుకి అభినందనలు తెలపడానికి అసలు ఆలోచించాలా? ” అని ఆమె ప్రశ్నించారు.
ఇప్పటికైనా ఇలా మెసేజ్ లు పంపుతున్న వారు బ్రేక్ తీసుకుని.. ఆ సమయాన్ని మరో దేశ సమస్యని సాల్వ్ చేయడానికి ఉపయోగిస్తే బాగుంటుంది అని కామెంట్ చేసారు. ఆమె ఈ వాక్యాలను తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఇండియా 50 ఓవర్లలో 240 పరుగులకే ఆల్ అవుట్ అయినా సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించేసారు.