Advertisement
డబ్బు కంటే ఏది ముఖ్యమైనది అనేది చాణక్య చెప్పారు. చాణక్య ఎన్నో విషయాలు గురించి చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితం బాగుంటుంది. చాణక్య నీతి శాస్త్రంలో జనాలకి డబ్బు గర్వం మంచిది కాదని చెప్పారు. ఎందుకంటే డబ్బు కంటే ముఖ్యమైనవి విలువైనవి ఉన్నాయట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. చాణక్య ప్రకారం ధర్మం డబ్బు కంటే ముఖ్యమైనది. ధర్మం, డబ్బు రెండిట్లో ఒక దాన్ని ఎంచుకోవాల్సి వస్తే ధర్మాన్ని ఎంచుకోవాలని చాణక్య చెప్పడం జరిగింది. అలాగే డబ్బు కంటే స్వగౌరవం చాలా ముఖ్యం అని చెప్పారు. గౌరవం విషయంలో డబ్బుని అసలు లెక్క చేయకూడదు.
Advertisement
డబ్బు మళ్ళీ వస్తుంది. కానీ మన గౌరవం మళ్లీ నిలబెట్టలేము. అదే విధంగా బంధాల విషయంలో డబ్బు గురించి ఆలోచించేవాడు. అవివేకవంతుడు అని చాణక్య చెప్పారు. డబ్బు లేకపోయినా బతకొచ్చు. కానీ బంధువులు, కుటుంబ సభ్యులు లేకుండా బతకడం కష్టం అని చాణక్య అన్నారు.
Advertisement
ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బు ముఖ్యమా లేదంటే ఇవి ముఖ్యమా అంటే ఇవే ఎంచుకోవాలి. డబ్బు కంటే ఇవన్నీ కూడా ముఖ్యమైనవి అని తెలుసుకోండి. డబ్బు కోసం పాకులాడుతూ వీటన్నిటిని వదులుకోవడం మంచిది కాదు. వీటిని మీరు ఫాలో అయినట్లయితే హ్యాపీగా ఉండొచ్చు డబ్బు కంటే విలువైనవి ఇవన్నీ. మీరు మీ పిల్లలకి కూడా నేర్పండి. పిల్లలు కూడా మంచి బాట పడతారు. పిల్లలు భవిష్యత్తులో పైకి వస్తారు. వీటిని అలవాటు చేసుకోవడం వలన మీ లైఫ్ బావుంటుంది. కావాలంటే ఈసారి ప్రయత్నం చేసి చూడండి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!