Advertisement
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రిమాండ్ విధించి రాజమండ్రి జైలులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనితో.. రాజమండ్రి జైలు సిబ్బందికి కొత్త ఇబ్బంది వచ్చి పడింది. అక్రమంగా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసారు అంటూ తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు రాజమండ్రి జైలుకు ఉత్తరాలు పంపిస్తున్నారట.
Advertisement
ఇవి కూడా చదవండి: సూపర్ స్టార్ కృష్ణ కోసం ఢిల్లీ పెద్దలతో గొడవ పడ్డ వైయస్ రాజశేఖర్ రెడ్డి !
“బాబుతో నేను” పేరిట రోజు వేలల్లో ఉత్తరాలు వచ్చి పడుతున్నాయట. మొదట్లో టీడీపీ కార్యకర్తలు మాత్రమే ఉత్తరాలు రాసేవారు. సెప్టెంబర్ 18 నే ఈ ఉత్తరాలు రావడం మొదలైందట. క్రమంగా బాబు అభిమానులు కూడా ఉత్తరాలు పంపించడం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఇది ఓ ఉద్యమంలా మారింది. చంద్రబాబు నాయుడి అరెస్ట్ ని వ్యతిరేకిస్తూ.. రాష్ట్ర ప్రజలు ఇప్పటివరకు ఏడు లక్షల లేఖలు రాసారు. ఈ లేఖలను చంద్రబాబుకు చేరనివ్వకుండా అడ్డుకుంటున్నారని.. అయినప్పటికీ ప్రజల నుంచి వచ్చే ఈ లేఖలను ఎవరూ అడ్డుకోలేరని టీడీపీ నేతలు అంటున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి: పవన్ కళ్యాణ్ కి అతి పెద్ద పరీక్ష ! ఇది నిజంగా ఒక పెద్ద సమస్యే !
అయితే ఈ విషయమై . టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజానగరం నియోజకవర్గ ఇన్ చార్జి బొడ్డు వెంకట రమణలు కలిసి రాజమండ్రి తపాలా కార్యాలయానికి వెళ్లి ఎంక్వైరీ చేసారు. ఇప్పటివరకు యాభై వేల లేఖలు మాత్రమే చంద్రబాబుకు చేరాయి. మిగతా లేఖలు ఎక్కడా? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు వచ్చే లేఖలు తీసుకువెళ్ళడానికి జైలు నుంచి ఓ అధికారి వస్తున్నారని తపాలాశాఖ అధికారులు పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో రాజమండ్రికి మరిన్ని లేఖలు వస్తాయని.. వీటిని చంద్రబాబు నాయుడికోసం జైలుకు తీసుకువెళ్లడం రాజమండ్రి జైలు సిబ్బందికి మరింత ఇబ్బందికరంగా మారింది.
ఇవి కూడా చదవండి: చంద్రబాబు అరెస్ట్ తో డీలా పడ్డ TDP అభిమానులకి గుడ్ న్యూస్ అతి త్వరలో…!