Advertisement
వేణు స్వామి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. వేణు స్వామి సెలబ్రిటీల జాతకాలు చెప్తూ పాపులర్ అయిపోయారు. ముఖ్యంగా సమంత, నాగ చైతన్య విడిపోతారని ఆయన అన్నప్పటి నుంచి కూడా విపరీతమైన పాపులారిటీ వచ్చింది. టీవీ ఫైవ్ మూర్తి ఇంకా కొంతమంది జర్నలిస్టులు కలిసి తమను ఐదు కోట్ల డిమాండ్ చేస్తున్నారని సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణు స్వామి, ఆయన భార్య వీణ సోషల్ మీడియా ద్వారా వీడియోని విడుదల చేసిన విషయం మనకి తెలిసిందే. అయితే వైరల్ అవుతున్న ఈ వీడియోలో టీవీ ఫైవ్ మూర్తి అయిదు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
అంత డబ్బు మా దగ్గర ఎందుకు ఉంటుందని వాళ్ళు చేసే వేధింపులు తట్టుకోలేక ఆ&త్మహ&త్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదే వీడియోలో కాల్ రికార్డింగ్ ని కూడా జోడించే టివి ఫైవ్ మూర్తితో పాటుగా ఇతర జర్నలిస్టులు పై వారు ఆరోపణలు చేయడం జరిగింది. వీటిపై టీవీ ఫైవ్ మూర్తి రియాక్ట్ అయ్యారు. వారు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని టీవీ లైవ్ షోలో ప్రకటించారు. అంతేకాదు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి వేణు స్వామి, వీణ అసత్య ఆరోపణలు చేస్తున్నారని కేసు పెట్టారు.
Advertisement
Also read:
Also read:
తను ఆ నేరం చేయలేదని.. ఆ నేరం ఆయన మీద పడేటట్టు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్లాక్మెయిలింగ్ కి పాల్పడినట్లుగా వారు చేసే ఆరోపణలను సాక్షాలు ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమని ఆరోపణల పై విచారణ జరగాల్సిన అవసరం ఉందని మూర్తి అన్నారు. తాను ఎప్పుడూ కూడా ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదని.. ఆ అవసరం లేదని అన్నారు. గతంలో ఆయన వికృతి చేష్టలు అబద్ధపు జ్యోతిష్యాల గురించి బయట పెట్టడం వలన ఇలా అసత్య ఆరోపణలు చేస్తున్నారని మూర్తి అన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!