Advertisement
టి20 వరల్డ్ కప్ లో భాగంగా సిడ్నీలో జరిగిన సూపర్ 12 మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘోర పరాజయం మూటగట్టుకుంది. కివీస్ చేతిలో ఏకంగా 89 పరుగులు భారీ తేడాతో ఓడిపోయింది. అది టి20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ వచ్చిన కంగారులు ఈ మ్యాచ్ చేతులు ఎత్తేశారు. ఏ దశలోను కివిస్ కు పోటీ ఇవ్వలేదు. ఆసీస్ ఆటగాళ్లు బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా రాణించలేదు. ఫీల్డింగ్ లో కూడా పలు తప్పిదాలు చేసింది.
Advertisement
అయితే 89 పరుగుల భారీ తేడాతో ఆసీస్ ఓడిపోవడం ఆసీస్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. మొదట బ్యాటింగ్ చేసిన కివిస్ 20 ఓవర్లలో 200 పరుగులు చేయగా, ఆసీస్ 17.1 ఓవర్లలో 111 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో 89 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కివీస్ ఆల్ రౌండ్ షో తో అదరగొట్టి, పొట్టి ప్రపంచ కప్ ను ఘనంగా బోనీ చేసింది. 92 పరుగులతో దుమ్ములేపిన న్యూజిలాండ్ ఓపెనర్ కాన్వే కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మొదట టాస్ గెలిచి ఆసిస్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో కివీస్ మొదట బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనర్లు ఫిన్ అలెన్, కాన్వే దూకుడుగా ఆడి మంచిగా ఆరంభాన్ని ఇచ్చారు. 4 ఓవర్లనే 56 పరుగులు జోడించారు. ముఖ్యంగా ఫీల్ అలెన్ ను చెలరేగి ఆడాడు. హాజిల్ వుడ్ అతనిని క్లీన్ బౌల్డ్ చేయడంతో 56 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
Advertisement
ఆ తర్వాత కెప్టెన్ విలియమ్సన్ తో కలిసి ఇన్నింగ్స్ ను నడిపించాడు. స్కోర్ బోర్డు 125 పరుగులు చేరుకున్నాక జంపా బౌలింగ్ లో విలియమ్సన్ ఎల్బిడబ్ల్యు రూపంలో పెవీలియన్ కు చేరుకున్నాడు. ఇదే ఓవర్ లో మొదటి బంతికి సిక్సర్ బాది అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు కాన్వే. ఇక చివరిలో కాన్వే తో పాటు నీషమ్ బ్యాట్ జులిపించడంతో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోర్ చేసింది. కాన్వె 92 పరుగులతో నాట్ అవుట్ గా మిగిలాడు. ఆసీస్ బౌలర్లలో కమీన్స్ రెండు వికెట్లు తీసుకోగా, హాజిల్ వుడ్, స్టాయినిస్, జంపా చెరో వికెట్ తీశారు. దీంతో ఆస్ట్రేలియా ఘోర పరాజయం మూటగట్టుకుంది.
READ ALSO : IND VS PAK : టీ20 ప్రపంచకప్‌లో బిగ్గెస్ట్ ఫైట్ – లక్ష మంది ఒకే సారి !