Advertisement
ఈరోజుల్లో ప్రతి దానికి కూడా ఫోటోషూట్లు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల కి ఫోటో షూట్ లు తప్పక తీసుకుంటున్నారు. పైగా ఫోటో షూట్ ల కోసం వేలకి వేలు డబ్బులు పెడుతున్నారు ఎంగేజ్మెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలని లైఫ్ లో గుర్తుండి పోవాలని ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తున్నారు పైగా ఫోటోలని తీసుకోవడానికి అందమైన ప్రదేశాలని ఎంచుకుంటున్నారు.
Advertisement
ఫోటోలు బాగా వస్తాయి అంటే ఖర్చు ఎంతైనా కూడా ఈ రోజుల్లో ఎవరూ లెక్క చేయడం లేదు అయితే ఫోటో షూట్లకు వెళ్లి ప్రాణాలని కోల్పోయే స్థితికి తెచ్చుకున్న వారు కూడా ఉన్నారు. గతం లో చాలా వార్తలు దీని మీద వచ్చాయి. సెల్ఫీలు తీసుకుని చాలామంది స్లిప్ అయి పడిపోయిన వార్తలు కూడా మనం చాలా విన్నాం. తాజాగా ఒక జంట హనీమూన్ కి వెళ్లి ప్రమాద బారిన పడి మరణించారు. ఇక పూర్తి వివరాలను ఇప్పుడే చూసేద్దాం…
కొత్తగా పెళ్లి అయ్యాక హనీమూన్ వెళ్లారు ఈ జంట. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందిన విభూషిణియా కి చెన్నైకు చెందని లోకేశ్వరన్ తో పెళ్లి అయ్యింది. జూన్ 01న పెళ్లి చేసుకున్నారు. ఆ తరవాత ఇండోనేషియా లోని బాలీ వెళ్లారు. ఈ నెల 09న సముద్రంలో బోటు రైడింగ్ కి వెళ్లగా బోట్ రైడ్ షూట్ చేసే టైం లో అదుపుతప్పి సముద్రంలో పడిపోయారు. ఇద్దరూ చనిపోయారు.
Advertisement
వారిద్దరి మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారంని ఇచ్చారు. పెళ్లి తర్వాత భార్యాభర్తలు కలకాలం కలిసి ఆనందంగా జీవించాలని అనుకుంటారు. పెళ్లి తర్వాత కొత్త జీవితాన్ని ఇరువురు కూడా మొదలుపెడతారు. ఇంచుమించు పెళ్లయిన తర్వాత ప్రతి జంట హనీమూన్ కి వెళ్తూ ఉంటారు. ఇరుకుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆనందంగా వీళ్ళు హనీమూన్ కి వెళ్లారని అనుకున్నారు.
కానీ ఒక్కసారిగా ఇలా జరుగుతుందని అసలు ఊహించ లేదు హనీమూన్ కోసం వెళ్ళిన ఈ జంట సడెన్ గా చనిపోవడంతో అటు వధువు కుటుంబసభ్యులు ఇటు వరుడు కుటుంబ సభ్యులు ఎంతో బాధపడ్డారు. కన్నీరు మున్నీరుగా విలపించారు కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
మరిన్ని ముఖ్య వార్తలు:
మీకు ఆర్థిక ఇబ్బందులా ? అయితే ఐదు సోమవారాలు శివుడికి ఈ పూజ చేసి చూడండి..
మీరు స్నేహితురాలికి చెప్పకూడని టాప్ 10 విషయాలు ఇవే..!