Advertisement
ఈరోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరు ఊహించలేము. పెళ్లి అయ్యి సంతోషంగా నూరేళ్లు ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు కానీ మన దశ బాగకపోతే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. నిజానికి మానవ జన్మని అనుభవించాలంటే ఎన్ని కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఈరోజుల్లో చాలామందిలో సహనం తక్కువ అయిపోతుంది. ప్రతి సమస్యకి చావే పరిష్కారంగా భావిస్తున్నారు. ఆఖరికి ప్రాణాలని కోల్పోతున్నారు. పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన నవ వధువుల్లో కొంతమంది ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు తాజాగా ఓ సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి అయ్యి నెల రోజులు కూడా కాలేదు కుటుంబ సభ్యులకి గుండెలని పగిలిపోయేలా చేసింది. ఆ నవవధువు చేసిన పని ఏంటి అసలు ఏం జరిగింది అనే విషయాన్ని చూద్దాం… అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన సుబ్బన్న లక్ష్మీదేవి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
Advertisement
Advertisement
వీళ్ళకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు వీరి కుటుంబం వ్యవసాయం మీద ఆధారపడి ఉంది ఎంతో కష్టపడి కుటుంబాన్ని నెట్టికొస్తున్నారు. పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. సుబ్బన్న తన ఇద్దరు కూతుర్లు ని బాగా చదివించారు. ఇటీవల పెద్ద కూతురు గాయత్రి పెళ్లి చేశారు ఈనెల 11వ తేదీ పెద్దవడగురు మండలం కండ్ల గూడూరు కి చెందిన గణేష్ అనే యువకుడికి ఇచ్చి గాయత్రి పెళ్లి జరిపించారు. తమ కూతురుకి పెళ్లి చేసుకున్న సంతోషంలో సుబ్బన్న దంపతులు ఉన్నారు.
అయితే వారి ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు పెళ్లి అయ్యి పది రోజులు కూడా కాలేదు గాయత్రి బల&వన్మర&ణానికి పాల్పడింది దీంతో ఒక్కసారిగా గాయత్రి కుటుంబం విషాదంలోకి వెళ్లిపోయింది. పుట్టింటికి వచ్చిన గాయత్రి శుక్రవారం ఇంట్లో విష గుళికలు మింగేసింది కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి గాయత్రి చనిపోయింది కడుపునొప్పి భరించలేక ఆత్మహత్యకి పాల్పడినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు మృతురాలు తల్లిదండ్రులు చిన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!