Advertisement
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు బిజీ లైఫ్ రిత్యా ఆరోగ్యంపై దృష్టి పెట్టడం లేదు. దీంతో అనేక అనారోగ్యాల బారిన పడి ప్రాణాలు కూడా పోతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, శారీరకంగా మానసికంగా ఫిట్ గా ఉండాలంటే ప్రతి రోజు జిమ్లలో వర్కౌట్ చేయాలి. దీనివల్ల మధుమేహం, అధిక బరువు, రక్తపోటు వంటి వ్యాధులు దరిచేరకుండా నివారించడంలో తోడ్పడుతుంది. మరికొందరైతే రాత్రిపూట కూడా వర్కౌట్ చేస్తారు.
Advertisement
అయితే చాలామందికి జిమ్ ఉదయం చేస్తే మంచిదా, లేదంటే సాయంకాలంలో చేస్తే మంచిదా అనే విషయంపై గదరగోళం ఉంది. దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే..
రాత్రిపూట జిమ్లలో కసరత్తులు చేసేవారు పగటీపూట చేయడమే మంచిదని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం రాత్రులు జిమ్ కి వెళ్లేవారికి అర్ధరాత్రి వరకు నిద్ర పట్టదు. ఎందుకంటే వర్క్ అవుట్ చేసే టైంలో హృదయ స్పందన బాగా పెరుగుతుంది. అలాగే శరీర కండరాలు అత్యంత స్థాయి రక్త ప్రసరణ పెరుగుతుంది. అలాగే రాత్రి సమయంలో ఆకలి అనిపిస్తుంది కాబట్టి కడుపునిండా తింటారు. ఈ క్రమంలో ఆహారం తీసుకున్న తర్వాత జిమ్ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు.
Advertisement
also read: గ్రహణం రోజు ఈ నియమాలు పాటిస్తే, దోషాలు పోతాయి !
రాత్రి సమయంలో వర్కౌట్ చేసిన తర్వాత కండరాలకు విశ్రాంతి అవసరం. అవి సేద తిరడానికి తగినంత విరామం అవసరం. లేదంటే కండరాల సమస్యలు తలెత్తుతాయి. రాత్రి సమయంలో జిమ్లో వర్కౌట్ చేస్తే వారి నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. జిమ్ తర్వాత ఈ వ్యవస్థ సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పట్టవచ్చు. దీని ఫలితంగా కండరాల నొప్పులు, తీవ్రమైన శరీరం నొప్పులు,వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రాత్రిపూట వర్కౌట్లు చేసేవారు ఇది తప్పకుండా గమనించాలని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.