Advertisement
మెగా బ్రదర్ నాగబాబు కూతురు మెగా బ్యూటీ కొణిదెల నిహారిక గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సినీ పరిశ్రమకు పరిచయం అయినప్పటికీ ఊహించినంతగా విజయం దక్కకపోవడంతో సినిమాలను వదిలేసి నిర్మాతగా సినిమాలను నిర్మిస్తోంది. చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టినప్పటికీ చిన్న చిన్న మనస్పర్దాలకే విడాకులు తీసుకుంది. కమిటీ కుర్రాళ్ళు సినిమాను కూడా ఈమె నిర్మించింది.
Advertisement
టీజర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా నిహారిక పాల్గొని సందడి చేసింది. గ్రామ సీమలో కుర్రాళ్ల ఆటలు పాటలు సరదా సన్నివేశాలు ఇటువంటి అన్నీ ఇందులో చూపిస్తారు. మీకు కూడా మళ్లీ ఎప్పటికీ తిరిగిరావని అనిపించే సంఘటనలు ఏదైనా ఉన్నాయా అని విలేకరులు అడిగితే.. చిన్నప్పుడు ఫిలిం ఛాంబర్ లో బ్రేక్ సమయంలో స్నాక్స్ కోసం ఎగబడే దానిని అలాంటివి చాలా ఉన్నాయని ఆమె అన్నారు.
Also read:
Advertisement
Also read:
అవి తిరుగు వస్తే బాగుంటుందని అనిపిస్తుందని ఆమె అన్నారు చిన్నతనంలో చిరంజీవి పెద్దనాన్న ఒక్కరే హీరో అనుకునేదాన్ని. ఎక్కువగా పెద్దనాన్న సినిమాలే చూసేదాన్ని అని ఆమె చెప్పారు. బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున తనుకు అప్పుడు తెలీదని అసలు వాళ్ళు హీరోలుగా సినిమాలు తీస్తారన్న విషయం తెలియదని ఆమె చెప్పారు తర్వాత క్రమంగా రామానాయుడు స్టూడియో ఛాంబర్ లో వాళ్ళ సినిమాలు చూడడం ప్రారంభించానని అవి చూశాక తనకు వీళ్ళు కూడా హీరోలని తెలిసిందని చెప్పింది. ప్రస్తుతం నిహారిక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసమే చూడండి!