Advertisement
నిహారిక కొణిదెల గురించి ఆమె వ్యక్తిగత జీవితం గురించి మనందరికీ తెలుసు. ఆమె యాంకర్ గా ఇండస్ట్రీలోకి వచ్చి తర్వాత హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. కానీ అంతగా గుర్తింపు రాలేదు. తర్వాత నిహారిక జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకున్నారు. ఎక్కువ రోజులు భర్తతో ఉండలేకపోయింది. ఊహించని విధంగా ఆమె కొన్ని రోజులకే భర్తతో విడాకులు తీసుకుని సింగిల్ గా ఉంటున్నారు. మెగా అభిమానులు కూడా నిహారిక గురించి మండిపడ్డారు.
Advertisement
ఆ టైంలో నిహారికను నెటిజెన్స్ విపరీతంగా ట్రోల్ చేశారు కూడా. ఆమె విడాకులు తీసుకోవడానికి కారణం ఆమె అని సోషల్ మీడియాలో ప్రచారం కూడా విపరీతంగా జరిగింది. తన గురించి వస్తున్న ప్రచారం గురించి నిహారిక ఎప్పుడు పెద్దగా స్పందించలేదు. యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడిన నిహారిక విడాకుల గురించి క్లారిటీ ఇచ్చారు. ఏడాదికే విడిపోతామని అనుకోలేదు దెబ్బ తగిలిన వాళ్లకే ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది అని చెప్పారు.
Advertisement
Also read:
పెళ్లి, విడాకులు ఈజీ కాదని.. నా భవిష్యత్తు గురించి ఆలోచించే విడాకులు తీసుకున్నానని ఆమె చెప్పారు. నిహారిక మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య రెండవ పెళ్లి గురించి ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండో పెళ్ళికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వధువు ఎవరో కాదు నిహారిక క్లోజ్ ఫ్రెండ్ అని జోరుగా ప్రచారం జరుగుతోంది. నిహారిక ఫ్రెండ్ తోనే చైతన్య పెళ్లి జరగచ్చని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియదు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!