Advertisement
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ చేసిన రచ్చ ఇంతా అంతా కాదు ఎప్పటి నుండో బన్నీ తీరు వివాదాస్పదంగా మారుతూ ఉండడంతో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి అది తారాస్థాయికి చేరిందని అంటున్నారు. చెప్పను బ్రదర్ తర్వాత పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ కి సంబంధాలు అంతగా బాలేదని గొడవలు వచ్చినప్పటికీ వాటిని పక్కనపెట్టి పవన్ కు మిగిలిన మెగా హీరోలు లాగా వెన్నుదన్నుగా నిలబడలేదని ఫాన్స్ మండిపడుతున్నారు. పవన్ కి కానీ ఆయన మద్దతు పలికిన కూటమి కోసం అల్లు అర్జున్ నోరు విప్పలేదు. పవన్ చంద్రబాబు కి బద్ధ శత్రువు జగన్ సారథ్యంలో వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిల తరఫున ప్రచారం చేశారు.
Advertisement
స్నేహ రెడ్డి తో పాటుగా నంద్యాల వెళ్లి అల్లు అర్జున్ ఆయనని గెలిపించమని కోరారు బన్నీ ప్రచారం చేసినప్పటికీ ఫలితాలు రోజున శిల్పా రవి చంద్ర ఓడిపోయారు. పవన్ గెలిచిన తర్వాత ఆయనకు విషెస్ తెలియజేస్తూ అల్లు అర్జున్ ఒక ట్వీట్ పెట్టారు అది తప్పించి వ్యక్తిగతంగా కలవడం కానీ చిరంజీవి ఇంట్లో జరిగినా సంబరాల్లో అల్లు అర్జున్ స్నేహ రెడ్డి అల్లు అరవింద్ కానీ కనిపించలేదు. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ లలో అల్లు అర్జున్ స్నేహ రెడ్డి లను అన్ ఫాలో కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Advertisement
Also read:
ఆయనను ఎలా ట్రీట్ చేస్తామో సాయిధరమ్ తేజ్ ద్వారా మెగా ఫ్యామిలీ హెచ్చరికలు పంపించిందా లేదంటే జరుగుతున్న వాటిని చూసి మేనల్లుడు స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నాడ అన్నది తెలీదు కానీ ఒకప్పుడు అల్లు అర్జున్ ని మెగా ఫ్యామిలీ నుండి వేరుగా చూడొద్దని వేదిక ద్వారా అభిమానులకు పిలుపునిచ్చిన సాయి ధరమ్ తేజ్ ఇలా చేశారంటే బన్నీ తీరుతో ఆయన ఎలా డిస్టర్బ్ అయ్యారు అర్థం అవుతోంది. ఈ విషయం గురించి నిహారికను విలేకరులు ఒక కార్యక్రమంలో ప్రశ్నించగా.. అన్ ఫాలో చేస్తున్న విషయం తెలియదని ఎవరి కారణాలు వాళ్లకి ఉంటాయని నిహారిక అన్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!