Advertisement
నటి నిహారిక కొణిదెల మరియు టెక్కీ చైతన్య JV డిసెంబర్ 9, 2020న ఉదయపూర్లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, వివాహం అయిన ఒక సంవత్సరం తర్వాత వారిద్దరూ విడిపోతున్నారు అంటూ పుకార్లు వచ్చాయి. ఆ తరువాత జూలై 2023లో ఈ జంట తమ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్లో వారిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత నుంచి వీరిద్దరూ విడాకుల విషయమై మౌనంగానే ఉన్నారు. చాలా రోజుల తరువాత నిహారిక తన స్నేహితుడు నిఖిల్ విజయేంద్ర సింహాతో పాడ్కాస్ట్లో మొదటిసారిగా తన విడాకుల గురించి ఓపెన్ గా మాట్లాడారు. దీనిపై ఆమె మాజీ భర్త చైతన్య కూడా స్పందించారు.
Advertisement
నిహారిక వివాహం మరియు విడాకులు తీసుకోవడం వల్ల మంచి లేదా చెడు విషయాల్లో నిజాయితీగా స్పందించారు. “నేను జీవితంలో నాపై దృష్టి పెట్టాలనుకునే దశలో ఉన్నాను, నేను కూడా నా తల్లిదండ్రులకు అండగా ఉండాలనుకుంటున్నాను” అని ఆమె చెప్పింది. తాను ఎప్పుడూ తన తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉంటానని, వారు లేకపోతే ఎలా పని చేయాలో కూడా నాకు తెలియదని నిహారిక చెప్పుకొచ్చింది. జీవితంలో మీకు సరి కాని వ్యక్తులపై ఆధారపడలేరని పేర్కొంది. “నేను విడాకులు తీసుకుని దాదాపు రెండు సంవత్సరాలు అయ్యింది, అది నన్ను ఎంత బాధపెట్టిందో నాకు మాత్రమే తెలుసు.” అని నిహారిక చెప్పుకొచ్చింది.
Advertisement
నా తండ్రి లాంటి వ్యక్తి నాకు సపోర్ట్ గా ఉండడం సంతోషకరమైన విషయమని.. నా తండ్రికి దొరికిన బెస్ట్ థింగ్ నేనేనని.. నేను హ్యాపీగా ఉండాలని ఆయన కోరుకుంటారని నా విడాకులు నా ఫ్యామిలీ యొక్క వేల్యూ ని చూపించాయి అని నిహారిక పేర్కొంది. విడిపోవడం వలన చాలా బాధపడ్డానని.. అందరు మనుషుల్ని నమ్మకూడదు అనే పాఠం నేర్చుకున్నానని పేర్కొంది. ప్రతి ఒక్కరికి పెళ్లి అంటే జీవితకాలం అని, కాని నా విషయంలో అలా జరగలేదని.. నా వయసు కేవలం ముప్పై సంవత్సరాలని.. ప్రేమ కోసం నా హృదయం ఇంకా తెరిచే ఉందని.. కాని ప్రస్తుతానికి నేను సింగల్ అని నిహారిక పేర్కొంది.
Read More:
కొత్తపార్టీ పెట్టిన దళపతి విజయ్.. లోక్ సభ ఎన్నికల నెల రోజుల ముందు?
ఒకేరోజు సెంచరీ కొట్టిన అన్నదమ్ములు.. ఇండియా టీం విజయంలో కీలక పాత్ర.. ఎవరంటే?