Advertisement
Nikhil Siddarth: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఈ ఏడాది కార్తికేయ 2 చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన నిఖిల్ ఈ చిత్రంతో పాన్ ఇండియా ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం 18 పేజెస్ సినిమా ఈ శుక్రవారం విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. నిఖిల్ సిద్ధార్ద్ – అనుపమ పరమేశ్వరన్ జంటగా జిఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 18 పేజెస్. నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న విడుదల చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు నిఖిల్.
Advertisement
Read also: బిగ్ బాస్ ఇనయాకు ఆల్రెడీ పెళ్లయ్యిందా ?
Advertisement
nikhil-siddarth wife Name
అయితే కార్తికేయ 2 సినిమా షూటింగ్ సమయంలో ఆయన తన భార్య పల్లవి తో విడిపోతున్నట్లు కొన్ని వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. 2020లో భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మను నిఖిల్ ప్రేమ వివాహం చేసుకున్నారు. 18 పేజెస్ ప్రమోషన్స్ లో భాగంగా నిఖిల్ మాట్లాడుతూ.. తను డైవర్స్ తీసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలను చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. అలాంటి వార్తలు చూసి స్టుపిడ్ గా అనిపించిందని.. ఆ తర్వాత వాటిని చూసి నవ్వుకున్నానని తెలిపారు. ఇలాంటి వార్తలకు చెక్ పెట్టాలని తన భార్యతో కలిసి ఫోటో పెడదామని అడిగితే.. వాటికి రియాక్ట్ కావలసిన అవసరం లేదని తనకే చెప్పిందని తెలిపారు.
nikhil-siddarth wife Name
ఇలాంటి వార్తలు రాసే సమయంలో మీడియా వాళ్ళు కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక యూట్యూబర్స్ వీడియో ఒకటి ఉంటే థంబ్నెయిల్ మరో రకంగా పెడుతున్నారని.. వీడియో చూస్తే మాత్రం అందులో కంటెంట్ ఏమీ ఉండదన్నారు. ఆ వీడియోలు కూడా చాలా దారుణంగా ఉంటున్నాయని అభిప్రాయపడ్డారు. దీనిపై ఎవరైనా యాక్షన్ తీసుకోవాలని.. లేదంటే యూట్యూబ్ కి సెన్సార్ అయినా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇక తాను తన భార్య పల్లవి వర్మ చాలా హ్యాపీగా ఉన్నామని స్పష్టం చేశారు నిఖిల్.
Read also: హనుమంతునికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? ఎలా చేయాలి?