Advertisement
నిర్మలా సీతారామన్ మెట్రోలో ప్రయాణం చేయడం ప్రస్తుతం వైరల్ అవుతోంది. నార్మల్ గా సెలబ్రిటీలు కానీ రాజకీయ నాయకులు కానీ అరుదుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్తుంటారు. అలాంటి సందర్భంలో జనాలు సెలబ్రిటీలు దగ్గరికి వెళ్లి మాట్లాడడానికి ట్రై చేస్తారు. సెల్ఫీలు కూడా దిగుతూ ఉంటారు, కొంతమంది ఆటోగ్రాఫ్ లు కూడా తీసుకుంటుంటారు. ఇదంతా మనం రొటీన్ గా చూస్తూ ఉంటాం. ఎన్నికల సమయంలో నాయకులు ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పటిదాకా విఐపి బందోబస్తులో ఉన్న వాళ్ళు తర్వాత మాత్రం సింపుల్ గా జనాలతో కలిసిపోతారు.
Advertisement
ఇలాంటివి మన రెగ్యులర్ గా చూస్తుంటాం ఎన్నికల తర్వాత ఏదైనా నాయకుడిని కలవాలంటే మాత్రం అపాయింట్మెంటు కనీసం వాళ్ళ ఇంటి గేటు దగ్గరకి వెళ్ళడానికి సెక్యూరిటీ వాళ్లు అనుమతించరు. ఇది ఇలా ఉంటే నిర్మల సీతారామన్ ఢిల్లీ మెట్రోలో ప్రయాణం చేశారు అక్కడ ఉన్న ప్రయాణికులు ఆమెని అస్సలు పట్టించుకోలేదు కనీసం లేచి నిలబడి సీటు కూడా ఇవ్వలేదు.
Advertisement
Also read:
Also read:
ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నిర్మల సీతారామన్ కి ఇలా చేదు అనుభవం ఎదురైనది. ఢిల్లీలోని మెట్రోలో ఆమె శనివారం సీఎం కోచింగ్ తరగతులను సందర్శించడానికి వెళ్లారు. ఆమె మెట్రోలో సాధారణ ప్రయాణికురాలిగానే నిలబడి వెళ్లారు చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఆమెని వింతగా చూసారు. కొంతమంది ఆమె దగ్గరికి వచ్చి పలకరించారు. కొంతమంది ఫోటోలు తీసుకున్నారు. కానీ ఆమె నిలబడే ప్రయాణం చేశారు నిజంగా కేంద్రమంత్రి ఇలా ప్రయాణం చేశారా లేదంటే ఎవరైనా సందేహం పడేటట్టు ఈ ఫోటోలు ఉన్నాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!