Advertisement
సినీ నటి నిర్మలమ్మ తెలుగు చిత్రసిమలో బామ్మ పాత్రలకు ప్రాణం పోసిన సహజ నటి. నిర్మలమ్మ వందలాది తెలుగు చిత్రాలలో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలలో నటించిన ఆమె సహజ నటిగా గుర్తింపు పొందారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లను మొదలుకొని, తర్వాత తరం హీరోలైన చిరంజీవి, రాజేంద్రప్రసాద్, బాలకృష్ణ లాంటి హీరోల సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.
Advertisement
ప్రముఖ సీనియర్ నటి నిర్మలమ్మ ఎక్కువగా తల్లి, బామ్మ, అత్త పాత్రలో నటించి పేక్షకులను మెప్పించారు. మొదటగా పౌరాణిక కథ చిత్రాలలో హీరోయిన్ గా నటించిన ఈమె కొంతకాలం గ్యాప్ తీసుకొని మళ్లీ 800 చిత్రాలకు పైగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి, రెండు నంది అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక నిర్మలమ్మ అసలు పేరు రాజమణి. నాటకాలు అంటే విపరీతమైన అభిమానం. కానీ కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించేవారు కాదు. కానీ పెదనాన్న మద్దతుతో నాటకాల్లో రాణించింది. అలా ఆమెకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో నిర్మలమ్మ 1943లో తన 16వ ఏట, గరుడ గర్వభంగం సినిమాలో చెలికత్తె పాత్రలో తొలిసారి తెరపై కనిపించింది. అలా ప్రారంభమైన ఆమె కెరీర్ ముందుకు సాగిపోయింది. సుమారు 1000 చిత్రాల్లో నటించింది నిర్మలమ్మ.
Advertisement
నిర్మలమ్మ కెరీర్ లో ఆమెకు బాగా పేరు తెచ్చిన సినిమాలు మయూరి, సీతారామరాజు. మయూరి చిత్రంలో డ్యాన్స్ చేయాలని తపించే మనవరాలుకి అండగా నిలిచే బామ్మ పాత్రలో జీవించింది నిర్మలమ్మ. ఇక సీతారామరాజు సినిమాలో అయితే ఏకంగా ప్రతినాయక లక్షణాలతో మెప్పించింది. ఈ రెండు సినిమాల్లో ఆమె నటనకు నంది అవార్డులు లభించాయి. చిరంజీవి స్నేహం కోసం సినిమా తర్వాత ఆమె నటించడం మానేసింది. ఆ తర్వాత 2009లో ఆమె మృతి చెందింది.
READ ALSO : బ్రహ్మానందం, AVS మధ్య గొడవలకు కారణం ఏంటి…? ఆ గొడవ అంత దూరం వెళ్లిందా…?