Advertisement
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. టీ 20 ప్రపంచ కప్ 2022 సూపర్ 12 లో రెండు ప్రత్యర్థి దేశాలకు తొలి మ్యాచ్. చివరి బంతి వరకు ఉత్కంఠ కలిగించిన మ్యాచును మలుపు తిప్పిన నో బాల్ పై ఇప్పుడు వివాదం రేగుతోంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠ రేపింది. టీం ఇండియాకు చివరి ఓవర్ లో 16 పరుగులు కావాలి. చివరి ఓవర్ మొదటి బంతికి హార్దిక్ పాండ్య అవుట్ అవ్వడంతో, ఇంకా 5 బంతుల్లో 16 పరుగుల అవసరం వచ్చింది. నాలుగవ బంతికి విరాట్ కోహ్లీ ఫైన్ లెగ్ దిశలో సిక్సర్ కొట్టాడు. అప్పుడు అంపైర్ నో బాల్ ఇవ్వలేదు.
Advertisement
ఆ తర్వాత విరాట్ కోహ్లీ నో బాల్ కోసం అంపైర్ ను అడిగాడు. ఇద్దరు అంపైర్లు కాసేపు ఈ విషయంపై చర్చించుకున్న తర్వాత లెగ్ అంపైర్ దీనిని నో బాల్ గా ప్రకటించాడు. ఆ సమయంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజం ప్రతిఘటించిన అంపైర్లు పట్టించుకోలేదు. వాస్తవానికి ఈ నో బాల్ మ్యాచ్ ను మలుపు తిప్పేసింది. ఇండియా 4 వికెట్ల తేడాతో విజయానికి కారణమైంది. అయితే, ఇండియా చీటింగ్ చేసి, గెలిచిందని, పాక్ మాజీలు, అక్కడి మీడియా పిచ్చి కూతలు కూస్తున్నాయి. షోయబ్ అక్తర్ వంటి మాజీ ఆటగాళ్లు సైతం, అంపైర్ నిర్ణయాన్ని పరోక్షంగా తప్పుపడుతూ సెటైరికల్ ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, ఆ మ్యాచ్ ముగిసి ఇరుజట్లు తదుపరి మ్యాచ్లకు సిద్ధమవుతున్న నో బాల్, డెడ్ బాల్ అంశంపై చర్చ నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ అంపైర్ సైమన్ టాఫెల్ పాక్ అభిమానులకు దిమ్మ తిరిగేలా ఆ మూడు పరుగుల గురించి వివరణ ఇచ్చాడు.
Advertisement
ఈ మేరకు భారత్-పాక్ మ్యాచ్ ఆఖరి ఓవర్ లో చోటు చేసుకున్న పరిణామాలపై సైమన్ స్పందిస్తూ, ” మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఇండియా-పాకిస్తాన్ ఉత్కంఠ పోరులో క్లైమాక్స్ గురించి, ముఖ్యంగా ఫ్రీ హిట్ బంతికి కోహ్లీ బౌల్డ్ అయిన తర్వాత వచ్చిన బైస్ గురించి వివరించాలని చాలామంది నన్ను అడిగారు. ఈ విషయంలో అంపైర్ నిర్ణయం సరైంది! బాల్ స్టంప్స్ ను తాకిన తర్వాత థర్డ్ మ్యాన్ వైపు వెళ్ళినప్పుడు బ్యాటర్లు మూడుసార్లు వికెట్ల మధ్య పరిగెత్తినప్పుడు బైస్ గా ఇవ్వడం ఖచ్చితంగా సరైనది! ఫ్రీ హిట్ సమయంలో స్ట్రైకర్ బౌల్డ్ అవ్వడు, కాబట్టి బంతి స్టంప్స్ ను తాకినందువల్ల డెడ్ బాల్ గా ప్రకటించే వీలులేదు. బైస్ నిబంధనల ప్రకారం అంపైర్ ఇచ్చిన సంకేతం సంతృప్తికరంగానే ఉంది” అని లింక్డిన్ ఆయన రాసుకోచ్చాడు.
Simon Taufel puts an end to dead-ball controversy!#INDvsPAK #T20WorldCup #SimonTaufel pic.twitter.com/7WW7Gk0Lal
— Siddharth Thakur (@fvosid) October 24, 2022
Read also: చనిపోయే ముందు ఉదయ్ కిరణ్ ఆమె కాళ్లు పట్టుకున్నాడట.. ఏం జరిగిందంటే?