Advertisement
బిసిసిఐ క్రికెట్లో కొత్త రూల్ తీసుకువచ్చింది.. ఇకనుంచి ఆ రూల్ వర్తించనుంది. ఇంతకీ వారు తీసుకున్న నిర్ణయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. క్రికెట్ మ్యాచ్ ఆడే సందర్భాల్లో అప్పుడప్పుడు ఎంపైర్లు ఇచ్చే తప్పుడు నిర్ణయాలు మ్యాచ్ స్వరూపాన్ని మారుస్తాయి. అవుట్ ను నాటౌట్, నాటవుట్ ను అవుట్ అని నిర్ణయాలు ప్రకటిస్తారు..ఇలా ఎంపైర్లు ప్రకటించిన నిర్ణయాలు మనం ఎన్నో చూసి ఉంటాం.. మ్యాచ్ చూస్తున్న మనం వీళ్ళకు కళ్ళు కనిపించవా అని మనసులో అనుకుని ఉంటాం. అయితే పోను పోను ఇలాంటి నిర్ణయాలు అధికమయ్యాయి. అలాంటి నిర్ణయాలు ఒక్కోసారి మ్యాచ్ ఫలితాన్ని మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
Advertisement
also read: ఎంత సంపాదించిన ఆనందం ఉండట్లేదా.. అయితే ఈ వాస్తు చిట్కాలు మీకోసమే..!!
A game changing review for the wide – Grace Harris has done it for UP Warriorz. pic.twitter.com/GHOvagU1nR
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 5, 2023
అయితే ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు బీసీసీఐ కొత్త రూల్ తీసుకువచ్చింది. ప్లేయర్స్ వైడ్, నో బాల్ వంటి వాటిపై సమీక్ష కూడా కోరవచ్చు. 2022 ఐపిఎల్ సీజన్లో ఢిల్లీ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఒక మ్యాచ్లో ఎంపైర్ నో బాల్ ఇవ్వకపోవడంపై ఢిల్లీ సారధి రిషబ్ పంత్ , వారి ఆటగాళ్లను క్రిజ్ వదిలి వచ్చేయాలని సందేశాలు ఇచ్చాడు. అందువల్ల మ్యాచ్ 10 నిమిషాల పాటు లేట్ అయింది. దీంతో ఎంపైర్లు పంతుపై విమర్శలు చేశారు. దీనికి ప్రధాన కారణం నో బాల్ కు సమీక్ష కోరే అవకాశం లేకపోవడం.. అయితే ఇది గమనించిన క్రికెట్ పెద్దలు ఈ కొత్త రూల్ తీసుకువచ్చారు. దీంతో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో వైడ్ కి, నో బాల్ కి డీఆర్ఎస్ రివ్యూ కోరే అవకాశం కల్పించింది బీసీసీఐ.
Advertisement
also read: ఈ వీక్ ఓటిటి లోకి 14చిత్రాలు.. ఆ ఒక్కటి చాలా స్పెషల్..!!
Rishabh Pant ne thik kiya. Worst umpiring. 😠 #DCvRR pic.twitter.com/BUmVOo3S1k
— Sushanta Acharjee (@SushantaIM) April 22, 2022
ఎంపైర్ల నిర్ణయాలను చాలెంజ్ చేయడానికి ప్రతి జట్టుకు మూడు డీఆర్ఎస్ రివ్యూలు ఉంటాయి. ఒకవేళ ఎంపైర్ వైడ్ ఇవ్వకపోయినా, నో బాల్ చెప్పకపోయినా సదరు బ్యాట్స్మెన్ డీఆర్ఎస్ కోరవచ్చు. దీంతో థర్డ్ ఎంపైర్ పరిశీలించి తుది నిర్ణయం చెబుతారు. అయితే గుజరాత్, యూపీ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో యూపీ ఆటగాడు గ్రేస్ హరీష్ ఈ విధంగా డీఆర్ఎస్ కోరి మ్యాచ్ ఫలితాన్ని మార్చారు. అయితే ఈ రూల్ ను పురుషుల ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్లో కూడా అమలు చేయబోతున్నారు. మరి డీఆర్ఎస్ రివ్యూ అనేది క్రికెట్ లో మంచిదేనా కాదా అనేది మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి..
also read: