Advertisement
బాలకృష్ణ, వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవ సభలో సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ స్పీచ్ లో మాట్లాడుతూ షూటింగ్ లో నాన్నగారు, ఆ రంగారావు, ఈ రంగారావు, అక్కినేని, తొక్కినేని ఇవే మాట్లాడుకునేవాళ్ళం అంటూ వ్యాఖ్యానించారు. కాగా బాలకృష్ణ చేసిన వాక్యాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. బాలయ్య చేసిన కామెంట్లపై ఇప్పటికే అక్కినేని వారసుడు నాగచైతన్య స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
Advertisement
అటు తెలుగు రాష్ట్రాల్లో అక్కినేని ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగి బాలయ్య పై విరుచుకుపడుతున్నారు. ఇక తాజాగా ఈ వ్యవహారంలో ఒక ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది. అదేమిటంటే నందమూరి బాలకృష్ణని అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ యాజమాన్యం లోపలికి అనుమతించడం లేదు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతానికి నందమూరి బాలకృష్ణ ఆహాలో అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె అనే ఒక టాక్ షో చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సెకండ్ సీజన్ దాదాపు పూర్తి కావచ్చింది.
Advertisement
అయితే రేపు ఒక ఎపిసోడ్ షూటింగ్ ఉందని, ఆ షూటింగ్ నిమిత్తం నందమూరి బాలకృష్ణ రేపు రావాల్సి ఉండగా మేము బాలకృష్ణను లోపలికి రానివ్వమంటూ అన్నపూర్ణ స్టూడియోస్ ఆహా టీం కి ఒక మెసేజ్ పెట్టినట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్త అయితే నిజం కాదని తెలుస్తోంది. ఎందుకంటే అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ టు పదవ ఎపిసోడ్ పవన్ కళ్యాణ్ గెస్ట్ తో టెలికాస్ట్ అవుతుంది. మూడో సీజన్ ప్రారంభించడానికి కాస్త సమయం పడుతుంది. ఇప్పట్లో బాలకృష్ణ ఆహా షూట్ కోసం అయితే అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇది ఎవరో సృష్టించిన వార్త అని తెలుస్తోంది.
Read also: డైరెక్టర్ కొరటాల శివ భార్య ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మాత్రం కచ్చితంగా హాట్సాఫ్ చెప్పాల్సిందే !