Advertisement
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా డైలాగ్ కింగ్ గా పాపులారిటీ సంపాదించుకున్న సీనియర్ హీరో మంచు మోహన్ బాబు గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆయన పేరు మాదిరిగానే ఆయనకి మొదటి భార్యకి సంబంధించిన విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మోహన్ బాబుకి విద్యాదేవితో పెళ్లి జరిగింది. వీరి సంతానంగా మంచు విష్ణు, లక్ష్మీ పుట్టారు.
Advertisement
ఆ తర్వాత మోహన్ బాబు వరుసగా సినిమా అవకాశాలు వస్తుండడంతో చాలా బిజీ ఆర్టిస్ట్ గా మారారు. అదే సమయంలో మోహన్ బాబు షూటింగ్ ముగించుకొని ఇంటికి ఆలస్యంగా వచ్చేవారట. అది భార్య విద్యాదేవికి అంతగా నచ్చేదికాదట. ఈ తరుణంలో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవలు జరిగేవట. దీంతో ఓ రోజు ఆమె గొడవలో భాగంగా బలవన్మరణం చేసుకుంది.
Advertisement
ఇక ఆ సమయంలో విష్ణు, లక్ష్మి చిన్న పిల్లలు కావడంతో వారికి తల్లిలేని లోటు ఉండకూడదని మోహన్ బాబుకి నచ్చజెప్పి విద్యాదేవి సోదరి నిర్మలాదేవితో పెళ్లి జరిపించారట. ఆ తర్వాత వీరికి మనోజ్ పుట్టాడు. ఇక నిర్మలాదేవి ఎలాంటి భేదభావం లేకుండా అక్క పిల్లలు అయినా విష్ణు, లక్ష్మీలను, మనోజ్ తో సమానంగా చూస్తోంది. కానీ మోహన్ బాబు కెరీర్ లో జరిగిన ఈ ఘటన మాత్రం ప్రేక్షకుల్లో చాలా తక్కువ మందికి తెలిసిన విషయమనే చెప్పాలి. తొలుత అతి కోపమున్న మోహన్ బాబు, నిర్మల దేవితో పెళ్లి జరిగిన తర్వాత క్రమక్రమంగా కోపం తగ్గింది. ఇక ఏ విషయాన్ని అయినా సరే మొహం మీదే మాట్లాడేతత్వం మాత్రం ఇప్పటికీ మారలేదు.
Read also: హిట్ అవ్వాల్సిన ఎన్టీఆర్ సినిమా ఆ స్టార్ హీరో కారణంగా అట్టర్ ప్లాప్ అయిన మూవీ ఏదంటే ?