Advertisement
సాధారణంగా విమానాల్లో భద్రత చర్యలు ఎంత పటిష్టంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. మీరు విమానంలో ఉన్నట్లయితే.. పైలెట్ ముందుగా అభినందనలతో పాటు ప్రయాణ వివరాలను తెలుపుతాడు. అంతకుముందు విమాన సిబ్బంది.. పైలెట్లను పరిచయం చేస్తారు. విమానం టేక్ ఆఫ్ నుండి ల్యాండింగ్ వరకు ప్రతి విషయంలోనూ సిబ్బంది చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ప్రయాణికుల భద్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇక విమానాలలో ఏ చిన్న సమస్య తలెత్తిన అసలు టేక్ ఆఫ్ చేయరన్న విషయం తెలిసిందే. ఫ్లైట్ విషయంలోనే కాదు.. వాటిని నడిపే పైలెట్ల విషయంలోనూ అంతే జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఇందులో భాగంగానే ఓ విమానంలోని కాక్ పిట్ లో ఉండే పైలట్లు ఇద్దరు ఒకే రకమైన ఆహారం తీసుకోరు.
Advertisement
Read also: ఎన్టీఆర్, చిరంజీవి లాగే త్రిపాత్రాభినయం చేసిన 9 మంది తెలుగు హీరోలు !
అయితే వారు ఆహారం తీసుకోవాలా? వద్దా? అనేది ఆయా విమానయాన సంస్థ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. కొద్దిరోజుల క్రితం హోలీ పండుగ రోజు ఓ ప్రైవేట్ విమానయాన సంస్థకు చెందిన విమానంలో ఇద్దరు పైలెట్లు కాక్ పిట్ లో ఒకే రకమైన ఆహారం తీసుకోవడం వివాదాస్పదమైంది. దీంతో ఆ ఘటనపై విచారణ చేపట్టిన విమానయాన సంస్థ యాజమాన్యం సదరు పైలెట్లను రోజువారి విధుల నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలో కమర్షియల్ విమాన పైలట్ల ఆహార నియమావళి గురించి సోషల్ మీడియాలో తీవ్ర చర్చ ప్రారంభమైంది. నిజానికి కొన్ని విమాన సంస్థల నిబంధనల ప్రకారం పైలట్లు కాక్ పిట్ లో ఆహారం తీసుకోకూడదు. కానీ మరికొన్ని విమానయాన సంస్థల పైలెట్లు కాక్ పిట్ లో ఆహారం తీసుకోవచ్చు.
Advertisement
అయితే ఇద్దరు పైలట్లు ఒకేసారి ఆహారం తీసుకోకూడదు అనే నిబంధన ఉంది. కొన్ని విమానాల్లో కాక్ పిట్ లో ఆహారం తీసుకునేందుకు ట్రే ఉంటే.. మరికొన్ని విమానాలలో ప్రయాణికులతో పాటు సీటులో కూర్చుని తినాల్సిందే. సాధారణంగా విమానంలో ఆటో పైలెట్ మోడ్ లో ఉన్నప్పుడు పైలెట్లు ఆహారం తీసుకుంటారు. ఇద్దరు పైలెట్లు ఒకే రకమైన ఆహారాన్ని తిన్నట్లయితే.. తాము తీసుకున్న ఫుడ్ వల్ల అసౌకర్యం కలిగితే విమానం అద్భుతప్పే ప్రమాదం ఉంది. కాబట్టి ఇద్దరు పైలట్లు వేర్వేరు ఆహారం తీసుకుంటారు. ఈ సాంప్రదాయాన్ని ప్రతి పైలెట్ పాటిస్తారు. ఒకవేళ ఇద్దరూ ఒకే రకమైన ఆహారం తింటామని మొండికేస్తే పరిమిత మోతాదులో మాత్రమే వారికి ఆహారం తినేందుకు అనుమతి ఇస్తారు.
Read also: RRR ఇంటర్వెల్ లోని ఈ సీన్ లో ఇంత అర్థం ఉందా ? రాజమౌళి నిజంగా గ్రేట్