Advertisement
నిత్యం వార్తల్లో నిలిచే టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత శాసనసభ ఎన్నికల్లో పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బీ ఫారం పై హుజురాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈటల రాజేందర్ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో గతేడాది అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.
Advertisement
దీంతో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కారు పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. ఇది ఇలా ఉంటే, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి మధురై కోర్టు సామాన్లు జారీ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ పై కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలపై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీంతో కోర్టు సమాన్లు ఇష్యూ చేసింది. మాణిక్యం ఠాగూర్ పిసిసి పదవిని రూ. 40 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపణలు చేశారు.
Advertisement
దీంతో మాణిక్యం ఠాకూర్ కౌశిక్ రెడ్డి పై మధురై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. పిటిషన్ విచారణకు స్వీకరించింది. పాడి కౌశిక్ రెడ్డి తరఫున ఎవరు హాజరు కాకుంటే వారెంట్ జారీ చేస్తామని వెల్లడించింది. రేవంత్ రెడ్డిని పిసిసి చీఫ్ చేసేందుకు రూ. 40 కోట్లు తీసుకున్నారని కౌశిక్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై అప్పటి తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ ఈ మేరకు పిటిషన్ వేశారు. ఆ తర్వాత ట్విట్టర్ వేదికగా రిప్లై కూడా చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడిన కౌశిక్ రెడ్డి పై పరువు నష్టం దావా వేస్తున్నానని అప్పుడే చెప్పారు. మదురై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు కోర్టు సమాన్లు జారీ చేసింది. సీఎం కేసీఆర్ కు విధేయులైన వారు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుంటారని మాణిక్యం ఠాకూర్ గతంలో అన్నారు.
Also Read: ఊహతో హీరో శ్రీకాంత్ విడాకులు?