Advertisement
తెలుగు రాష్ట్రాల్లో ఆ ఇద్దరు మహిళ ఆఫీసర్ల గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఇద్దరు వేరు వేరు పోస్టుల్లో ఉంటున్నారు. అలాంటిది ఒకే పోస్టింగ్ లో ఉంటే అసలు ఆ టాపిక్ ఇంకా ఎంతలా వినపడుతుందో.. స్మిత సబర్వాల్, ఆమ్రపాలి కాటా ఇద్దరు కూడా మంచి డైనమిక్ ఆఫీసర్లు. ఇద్దరు కూడా తనదైన రీతిలో మార్పుని చూపిస్తున్నారు. ఎవరు స్థాయిలో వాళ్ళు దూసుకు వెళ్తున్నారు. అయితే తెలంగాణలో ప్రధాన పోస్టుల్లో ఉన్న వీళ్ళిద్దరికీ పరిస్థితులు మారాయి స్మిత 2001 ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ అధికారి ఆమె తెలంగాణ ఏర్పడక ముందే కొన్ని జిల్లాలలో కలెక్టర్ గా పని చేశారు.
Advertisement
మెదక్ కలెక్టర్ గా పని చేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం సీఎం కేసీఆర్ తన టీమ్ లోకి తీసుకోవడం జరిగాయి. సీఎం సెక్రటరీగా సుదీర్ఘకాలం ఆమె పని చేశారు. అయినా ప్రజల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఆమె తెచ్చుకున్నారు. తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది. ఆమెను ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా పెట్టారు.
Advertisement
Also read:
ఆ బాధ్యతల్ని ఇప్పుడు చూస్తున్నారు. ఆమ్రపాలి విషయానికి వస్తే.. ఆమె ట్రెండీ థింగ్స్ తో ట్రెండింగ్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. జిహెచ్ఎంసి కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్నారు. తర్వాత కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులతో తెలంగాణ నుంచి రివీల్ అయిపోయి.. ఏపీలో జాయిన్ అయ్యారు. ఏపీలో రిపోర్ట్ చేసినా ఆమ్రపాలి టూరిజం ఎండి గా నియమితులయ్యారు. స్మిత సబర్వాల్ కూడా టూరిజం సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే అది తెలంగాణలో ఇద్దరు కూడా ఇప్పుడు ఒకే పోస్టుల్లో ఉన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!