Advertisement
తెలుగు ఇండస్ట్రీలో సొంత టాలెంట్ తో బేస్ ఏర్పరచుకొని పైకొచ్చిన స్టార్లు ఎవరైనా ఉన్నారు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది జూనియర్ ఎన్టీఆర్ మరియు ఉదయ్ కిరణ్. వీరిద్దరూ వారి నటన తో ఎంతోమంది అభిమానులను మెప్పించారు. అలాంటి ఇద్దరు స్టార్ హీరోల మధ్య మూడు సినిమాలకు తీవ్రమైన పోటీ ఏర్పడిందట. మరి ఇందులో ఎవరు బాక్సాఫీస్ వద్ద రికార్డును సొంతం చేసుకున్నారో ఓ సారి చూద్దాం..?
Advertisement
2006 :
2006 లో ఉదయ్ కిరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ సినిమాల మధ్య పోటీ ఏర్పడింది. రాఖీ మూవీ తో జూనియర్ ఎన్టీఆర్ డిసెంబర్ 22న రాగా.. దీని తర్వాత ఒక రోజు గ్యాప్ తో డిసెంబర్ 23న ఉదయ్ కిరణ్ అబద్ధం సినిమా రావడం జరిగింది. ఇందులో కృష్ణవంశీ డైరెక్షన్ చేసిన రాఖీ మూవీ, పూర్తి ఎమోషనల్ మరియు ఎంటర్టైన్మెంట్ తో వచ్చే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సొంతం చేసుకుంది. ఉదయ్ కిరణ్ అబద్ధం మూవీ విషయానికి వస్తే కె.బాలచందర్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడం జరిగింది. అప్పటి ట్రెండ్ కి ఈ సినిమా ఏమాత్రం సూట్ కాకపోవడంతో డిజాస్టర్ గా నిలిచింది.
Advertisement
2012 :
నువ్వెక్కడుంటే నేనక్కడుంటా అనే సినిమాతో ఉదయ్ కిరణ్ ఏప్రిల్ 20న రాగా, దానికి వారం రోజుల గ్యాప్ తో ఏప్రిల్ 27న జూనియర్ ఎన్టీఆర్ దమ్ము సినిమా రిలీజ్ అయింది. ఇందులో ఉదయ్ కిరణ్ నువ్వెక్కడుంటే నేనక్కడుంటా పూర్తి లవ్ బేస్డ్ సినిమా కావడంతో పాటలు ఆకట్టుకున్నా కథ మాత్రం బోరింగ్ గా ఉండడంతో సినిమా ప్లాప్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ సినిమా దమ్ము, టైటిల్ లో ఉన్న దమ్ము సినిమాలో లేకపోవడంతో ఇది కూడా భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.
2013:
ఏప్రిల్ 5వ తేదీన బాద్ షా మూవీ తో ఎన్టీఆర్ సినిమా వస్తే, దానికి ఆరు రోజుల గ్యాప్ తో ఏప్రిల్ 11న ఉదయ్ కిరణ్ జైశ్రీరామ్ సినిమాతో రావడం జరిగింది. శీను వైట్ల డైరెక్షన్లో వచ్చిన బాద్ షా విజయవంతం అవగా, ఉదయ్ కిరణ్ మూవీ మాత్రం ఆశించిన ఫలితం రాలేదు.
also read:
గోత్రం అంటే ఏమిటి..? ఒకే గోత్రం ఉన్న వారు వివాహం చేసుకోవచ్చా..?