Advertisement
సినీ ఇండస్ట్రీలో ఇద్దరి మధ్య గొడవలు, ఇద్దరు మధ్య స్నేహనికి సంబంధించిన విషయాలు మనం తరచూ చూస్తూనే ఉంటాము. ఒక్కోసారి కొంతమంది అభిప్రాయ బేధాలు రావడంతో విడిపోవడం, ఎక్కువ కాలం మాట్లాడుకోకపోవడం వంటివి కూడా చేస్తే ఉంటాము. చిన్న మాటతో 20 ఏళ్ల స్నేహం విచ్ఛిన్నమైంది. ఎన్టీఆర్, విశ్వనాధ్ల మధ్య దూరం కూడా పెరిగిపోయింది. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏమైంది అనే విషయాన్ని చూద్దాం. సినీ పరిశ్రమలోకి రాక ముందు నుండి విశ్వనాధ్ ఎన్టీఆర్ల స్నేహం ఉంది. ఇద్దరూ కూడా బాగా క్లోజ్ గా ఉండేవారు. కానీ అనుకోని సంఘటన కారణంగా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది.
Advertisement
గుంటూరు హిందూ కాలేజీలో ఇద్దరు డిగ్రీ చదువుకున్నారు ఎన్టీఆర్. ఒక ఏడాది సీనియర్. విశ్వనాథ్ కాలేజీలో ఉండగానే ఎన్టీఆర్ సబ్ రిజిస్టర్ గా గుంటూరులో జాబ్ తెచ్చుకున్నారు. ఉద్యోగరీత్యా ప్రతిరోజు విజయవాడ నుండి గుంటూరు కి ట్రైన్ లో వెళ్లేవారు. విశ్వనాథ్ కాలేజీకి వెళ్లడానికి ట్రైన్ ఎక్కేవారు. ఇలా స్నేహంగా ఉండేవారు. కొన్నాళ్ళకు సినిమాల్లో అవకాశాలు రావడంతో ఎన్టీఆర్ మద్రాస్ వెళ్లిపోయారు ఆ తర్వాత విశ్వనాథ్ వాహిని స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ గా ఉద్యోగంలో చేరారు. షూటింగ్ నిమిత్తం స్టూడియోకి వచ్చే ఎన్టీఆర్ ని అప్పుడప్పుడు కలుసుకునేవారు విశ్వనాధ్ దర్శకుడు అయ్యాక ఎన్టీఆర్ హీరోగా రూపొందించిన మొదటి సినిమా కలిసి వచ్చిన అదృష్టం. తర్వాత ఎన్టీఆర్, విశ్వనాథ్ కాంబినేషన్లో నిండు హృదయాలు సినిమా వచ్చింది.
Advertisement
Also read:
1971 లో వచ్చిన చిన్ననాటి స్నేహితులు సినిమా ఘనవిజయాన్ని సాధించింది. ఈ మూవీ నిర్మాణం సమయంలోనే ఎన్టీఆర్ విశ్వనాధ్ మధ్య విభేదాలు వచ్చాయి. సెంటిమెంట్ సీన్ అప్పుడు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవద్దని ఎన్టీఆర్ కి విశ్వనాథ్ చెప్పారు. పరవాలేదు అన్నారు ఎన్టీఆర్. నిర్మాత జోక్యం చేసుకుని విశ్వనాథ్ కి నచ్చజెప్పారు. కూలింగ్ గ్లాసుల తోనే షాట్ చేశారు. విశ్వనాథ్ మీద కోపంతో ఉన్నారు ఎన్టీఆర్. ఆయనను తప్పించేసి యోగా నంద్ ని మరో సినిమాలో తీసుకున్నారు. ఇది జరిగిన 14 ఏళ్ల తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా జననీ జన్మభూమి మూవీని రూపొందించారు విశ్వనాథ్. కానీ సినిమా సక్సెస్ అవ్వలేదు వీళ్ళిద్దరూ విడిపోయి మళ్లీ కలుసుకున్నాక ఏ సినిమా కూడా చేయలేదు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!