Advertisement
సీనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నటుడిగా ఎన్నో సంచలన విజయాలని ఎన్టీఆర్ అందుకున్నారు. అటు రాజకీయాల్లో కూడా ఊహించని స్థాయిలో సంచలనాన్ని సృష్టించారు అన్నగారు. ఎన్టీఆర్ మాస్ సినిమాలు చేసినా, క్లాస్ సినిమాలు చేసినా కచ్చితంగా హిట్ అయ్యేవి.
Advertisement
ఎన్టీఆర్ ఎప్పుడు పాత్రలకి తన నటనతో ప్రాణం పోసేవారు. పైగా నిర్మాతల శ్రేయస్సును కోరుకునేవారు. ఎన్టీఆర్ చేసిన మూవీస్ సంవత్సరం కూడా ఆడిన రోజులు ఉన్నాయి. ఎన్టీఆర్ షూటింగ్ విషయంలో ఎంతో క్రమశిక్షణగా ఉండేవారు. సినిమాలు వేగంగా పూర్తి అవడానికి ఎన్టీఆర్ చాలా కష్టపడేవారు. సీఎం అయిన తర్వాత ఆయన సంక్షేమ పథకాలను అమలు చేశారు.
సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ వల్లే ఇన్ని మార్పులు..!
ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా అమలులో ఉన్నాయి. నటుడుగా ఎన్టీఆర్ కోట్ల రూపాయల ఆస్తుల్ని సంపాదించారు. అయితే ఎన్టీఆర్ లాంటి ఇంకొక వ్యక్తి ఎప్పుడు పుట్టరని అంటూ ఉంటారు అందరూ. కొత్త తరం దర్శకుల్ని ప్రోత్సహించి తెలుగు సినిమా మార్కెట్ ని పెంచారు.
Advertisement
అలానే అప్పట్లో ఎన్టీఆర్ రాజకీయంగా బీసీ నేతలు ఎదగడంలో సీనియర్ ఎన్టీఆర్ పాత్ర చాలా ఉంది. ఈ తరం వాళ్లు కూడా ఎన్టీఆర్ గొప్పతనం గురించి చెప్పుకుంటూనే ఉంటారు. అటు రాజకీయాల్లో కానీ ఇటు సినిమాల్లో కానీ ఎన్టీఆర్ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఇలా ఎన్టీఆర్ సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ ఎన్నో మార్పులు తీసుకొచ్చారు.
Also read: