Advertisement
ఏ రంగంలో అయినా అభివృద్ధి సాధించాలంటే ముందు ఉండాల్సింది సమయపాలన. సమయానికి చేరుకోవడం.. చెప్పిన సమయానికి పనిని చేసి చూపించడం అనేది ఏ రంగంలో అయినా తప్పని సరి. ఇక రాజకీయాల్లో ఈ సూత్రం మరింత బాగా వర్తిస్తుంది. రాజకీయాల్లో రాణించాలంటే సమయ స్పూర్తితో పాటు టైమింగ్ కూడా చాలా ముఖ్యమైనది. ఇక ప్రధాన రాజకీయ పార్టీల నుంచి పోటీ చేసే అవకాశం వస్తే టైం కి వెళ్లలేక.. అలాంటి అవకాశాన్ని ఓ వ్యక్తి కోల్పోయారు. అతని గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
Advertisement
నందమూరి తారక రామారావు 1982లో టీడీపీని స్థాపించారు. ఈ సంఘటన 1983 ఎన్నికల్లో జరిగింది. 1983లో టీడీపీ పార్టీ తోలి ఎన్నికలలో పోటీ చేసింది. మైనారిటీ వర్గానికి చెందిన న్యాయవాది నియామతుల్లాఖాన్ అనే వ్యక్తికి ఎన్టీఆర్ బోధన్ నుంచి పోటీ చేసే అవకాశాన్ని ఇవ్వాలని అనుకున్నారు. ఆయనకీ రాత్రి తొమ్మిది గంటల సమయంలో టీడీపీ ఆఫీస్ నుంచి సమాచారాన్ని అందించారు. తెల్లారి ఉదయం నాలుగున్నర గంటల ప్రాంతంలో గండిపేట లోని టీడీపీ కుటీరానికి రావాల్సిందిగా తెలిపారు. ఈ విషయాన్నీ నియామతుల్లాఖాన్ తన ఫ్రెండ్స్ కి తెలిపారు. అయితే.. ఫ్రెండ్స్ అభినందించి ఆ రాత్రి పార్టీ చేసుకున్నారు.
Advertisement
అయితే.. ఆ చర్చల్లో తెల్లవారు జామున నాలుగున్నర గంటలకు ఎవరూ ఉండరని.. హైదరాబాద్ కు ఆరున్నరకు వెళ్లేలా ఆయన స్నేహితులు ప్లాన్ చేసారు. అందుకోసం కార్ ఏర్పాటు చేసారు. తీరా హైదరాబాద్ వెళ్లి.. గండిపేట కుటీరానికి వెళ్లేసరికి ఆలస్యం అయ్యింది. తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి టికెట్ ఖరారు అయిన అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చేశారని తెలిపారు. ఎన్టీఆర్ వద్దకు వెళ్లి నియమతుల్లాఖాన్ తనగురించి అడిగేసరికి.. నాలుగున్నరకి రమ్మంటే.. రెండు గంటలు లేటుగా ఎందుకు వచ్చారని నిలదీశారట. సమయపాలన లేని వారికి తన వద్ద చోటు లేదని ఎన్టీఆర్ ఆయనను వెనక్కి పంపించేసారట. ఈ సంఘటనను నియమతుల్లాఖాన్ ఇప్పటికీ తలచుకుంటారు. ఆ ఏడాది టీడీపీ గెలిచింది. ఎన్టీఆర్ సీఎం అయ్యారు. నియమతుల్లాఖాన్ ప్లేస్ లో సెకండ్ ఆప్షన్ లో ఉన్న సాంబశివరావు కు బీఫామ్ ను అందించారు. ఆయన ఆ ఏడాది ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు.
మరిన్ని..
చంద్రబాబు విషయంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒక మాట మీదే నిలబడ్డారుగా.. ఇద్దరూ..?
చంద్రబాబు నాయుడుకి 7691 నంబర్ ను ఎలా ఇచ్చారు? జైల్లో ఖైదీలకు నంబర్స్ ఎలా ఇస్తారు?
నారా బ్రాహ్మణికి పోసాని కౌంటర్.. నేను అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పగలవా అంటూ..?