Advertisement
జూనియర్ ఎన్టీఆర్ కు ఎన్టీఆర్ వారసుడిగా ఎంత ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన బ్యాక్ గ్రౌండ్ గురించి పక్కన పెడితే.. ఆయన తన ప్రతిభతో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నారు. ఆయన సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారో అందరికి తెలుసు. అయితే.. ఇకపై ఏపీలో ఆయన సినిమాలు ఆడడం కష్టం అవుతుందా? అసలు సోషల్ మీడియాలో ఈ చర్చ ఎందుకు జరుగుతోంది ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో చాలా మార్పులు వచ్చాయి. ఆయన అరెస్ట్ పై ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ స్పందన తెలియచేసారు. గతంలో టిడిపి పార్టీకి సహకరిస్తూ తన వంతు ప్రచారం చేసిన తారక్ మాత్రం చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై ఇంత వరకు స్పందించలేదు. దీనితో తారక్ ను అభిమానించే టీడీపీ పార్టీ కార్యకర్తల్లో అసహనం కనిపిస్తోంది. ఆయన ఎందుకు స్పందించలేదు అంటూ టీడీపీ కార్య కర్తలు ప్రశ్నిస్తుంటే.. మరోవైపు ఆయనకు అవమానాలు జరిగినప్పుడు మీరంతా ఎక్కడకు వెళ్లారు? ఇప్పుడు ఆయన ఎందుకు స్పందించాలి అంటూ ఎన్టీఆర్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Advertisement
దీనితో ఈ విషయంలో టీడీపీ కార్యకర్తలకు, ఎన్టీఆర్ అభిమానులకు మధ్య వార్ నడుస్తోంది. ఈ క్రమంలో ఓ టీడీపీ కార్యకర్త స్వయంగా ఎన్టీఆర్ కు ఫోన్ చేసి సినిమాల విషయంలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అంటూ ఓ వార్తా వైరల్ అయింది. దీనికి ఎన్టీఆర్ అభిమానులు కూడా గట్టి కౌంటర్ నే ఇచ్చారు. ఎన్టీఆర్ రాబోయే సినిమా ఒక్క షో ని అయినా ఆపి చూడండి అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. ఈ వ్యవహారం పై ఎన్టీఆర్ ఇప్పటివరకు స్పందించలేదు.
మరిన్ని..
ఈ ఏడాది అక్టోబర్ నవంబర్ లలో ఏమి జరగబోతోంది? అభిగ్య ఆనంద్ ఏమి చెబుతున్నారంటే?
Jailer Movie: జైలర్ మూవీ లో “వర్మ” గ్రూప్ లో ఉన్న ఈ డాన్సర్ ఎవరో తెలుసా?