Advertisement
తెలుగింటి అన్నగారు ఎన్టీఆర్ నటనా వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో పాత్రలను అవలీలగా పోషించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన నటుడు ఎన్టీఆర్. ఆయన సినిమాల్లో రాణించాక టాప్ పొజిషన్ లో ఉన్న సమయంలోనే రాజకీయాల వైపుకు వెళ్లిపోయారు. తెలుగు దేశం పార్టీని స్థాపించి ప్రజా సంక్షేమం కోసం కృషి చేసారు. సినీ రంగంలో ఆయన తరువాత ఆ లెగసీని బాలకృష్ణ కొనసాగించారు. ఆ తరువాత మూడవ తరం వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ తన సత్తా చాటారు.
Advertisement
వీటిని కూడా చదవండి: Jr NTR: చంద్రబాబు విషయంలో ఎన్టీఆర్ స్పందించకపోవడానికి కారణం ఏంటో తెలుసా ?
ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయమై ఎన్టీఆర్ ఇప్పటివరకు స్పందించలేదు అంటూ పలువురు నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. మరోవైపు ఎన్టీఆర్ ఎందుకు స్పందించాలి అంటూ ఎన్టీఆర్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ ను చాలా సార్లు అవమానించారని.. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే ఎన్టీఆర్ ఎందుకు స్పందించాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Advertisement
వీటిని కూడా చదవండి: విజయ్ ఆంటోనీ కూతురు మరణం లో దిమ్మ తిరిగే ట్విస్ట్ ! తెరపైకి కొత్త వ్యక్తి అదెవరంటే ??
కొందరైతే మరింత ముందుకు వెళ్లి ఎన్టీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇకపై ఎన్టీఆర్ సినిమాలను చూడబోము అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనితో ఎన్టీఆర్ అభిమానులు మరింత రెచ్చిపోతున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై చాలా మంది స్పందించలేదని.. కానీ ఎన్టీఆర్ ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఎన్టీఆర్ ను విమర్శించే వాళ్ళు గతం ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ కోసం ఏ రేంజ్ లో కష్టపడ్డారో గుర్తు చేసుకోవాలని అంటున్నారు. ప్రస్తుతం తారక్ దేవర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా తరువాత సినిమాలు కూడా భారీ బడ్జెట్ లోనే తెరకెక్కుతున్నాయి. ప్రశాంత్ నీల్, తారక్ కాంబోలో కూడా ఓ సినిమా రాబోతోంది. ఈ సినిమా మైత్రీ మూవీ బ్యానర్ పై తెరకెక్కుతోంది.
మరిన్ని..
వీటిని కూడా చదవండి: విజయ్ ఆంటోనీ తన కూతురుతో చివరగా మాట్లాడిన మాటలు ఇవే.. ఏమన్నారంటే?