Advertisement
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ టాప్ ఫైవ్ స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆయనకు ఆ స్టార్డమ్ ఆషామాషీగా రాలేదు. ఎంతో కష్టపడి అభిమానుల మనసులను మెప్పించుకొని ఇంతటి స్టార్ గా ఎదిగాడు.. అలాంటి బాలయ్య ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చేముందు ఒక సినిమా కోసం తన తండ్రి ఎన్టీఆర్ మూడు కండిషన్లు పెట్టాడట.. అవేంటి?ఎందుకు పెట్టారు? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.. మంగమ్మగారి మనవడు..ఈ సినిమా బాలకృష్ణ కెరీర్నే మార్చేసింది.. భారతి రాజా తమిళ్లో తీసిన మనువాసనై సినిమాను తెలుగులోకి కోడి రామకృష్ణ డైరెక్షన్లో మంగమ్మగారి మనవడు అనే టైటిల్ తో రీమేక్ చేశారు.
Advertisement
also read: కార్తీక మాసంలో ఉపవాసం ఎలా చేయాలి, నియమాలు ఇవే!
Advertisement
ఇందులో మంగమ్మగారి పాత్రను స్టార్ యాక్టర్ భానుమతితో చేయించారు. అయితే ఒకవేళ భానుమతి ఒప్పుకోకుంటే ఈ సినిమా తీయకపోవడమే మంచిదని ఎన్టీఆర్ కరాకండిగా చెప్పేశారు. దీనికోసం ఆయన స్వయంగా ఫోన్ చేసి భానుమతిని ఒప్పించారు. అప్పటికే ఇండస్ట్రీలో భానుమతి స్టార్ నటి, నిర్మాత, దర్శకురాలు,స్టూడియో అధినేత్రి,గాయని అన్నింటికీ మించి మంచి విలువలు కలిగిన మనిషిగా కొనసాగుతోంది. మరి ఆమెతో సినిమా అంటే మామూలు విషయం కాదు. దీంతో ఎన్టీఆర్ షూటింగ్ మొదలుపెట్టేముందు బాలకృష్ణకు మూడు విషయాలు చెప్పాడు.. అవి తప్పనిసరిగా పాటించాలని అన్నారు.
1. భానుమతి కంటే అరగంట ముందే షూటింగ్ స్పాట్ కు వెళ్ళి రెడీగా ఉండాలి. ఏ రోజు నీవల్ల ఆమె వెయిట్ చేయొద్దు..
2. ఆమె రాగానే కారు డోర్ తీసి ముందు నిలబడాలి.
3. కారులోంచి దిగగానే ఆమె కాళ్ళకు నమస్కరించాలి..
ఎన్టీఆర్ పెట్టిన ఈ మూడు షరతులను బాలయ్య ఒప్పుకోవడమే కాకుండా షూటింగ్ జరిగినన్ని రోజులు పాటించారు. సినిమా షూటింగ్ ఎండింగ్ కి వచ్చే సమయంలో భానుమతి బాలకృష్ణతో ఇలా చేయమని మీ నాన్నగారు చెప్పారా, జీవితంలో బాగా ఎదుగుతావు అని ఆశీర్వదించిందట. ఇక ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్ అయింది.