Advertisement
భాషతో సంబంధం లేకుండా అన్ని చిత్ర పరిశ్రమల్లో విజయవంతమైన వ్యక్తుల జీవిత చరిత్రలతో రూపొందుతున్న సినిమాలు రావడమే కాదు. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయి. తాజాగా మరో బయోపిక్ రాబోతోంది. ఇది వరకు మహేంద్రసింగ్ ధోని బయోపిక్ మనం చూసాం. ఇప్పుడు యువరాజ్ సింగ్ బయోపిక్ రాబోతోంది. రవి భూషణ్ కుమార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. రెండేళ్ల నుంచి యువరాజ్ సింగ్ కి సంబంధించిన పూర్తి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి కథను, స్క్రిప్ ని రెడీ చేసారు.
Advertisement
యువీ ఆల్ రౌండర్ గా నిలవడమే కాకుండా ఇండియాకు ప్రపంచకప్ రావడంలో కీలక పాత్ర పోషించారు. తర్వాత క్యాన్సర్ రావడం దాన్ని జాగ్రత్తగా ఎదుర్కోవడం ఈ సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తోంది. యువరాజ్ సింగ్ పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో ఉండే తారక్ ని కలిసి దీనిపై చర్చించబోతున్నట్లు సమాచారం. ఇలాంటి క్యారెక్టర్ కోసం తారక్ లాంటి హీరో అయితే న్యాయం చేస్తారని నిర్మాతలు భావిస్తున్నారట.
Advertisement
Also read:
సోషల్ మీడియాలో నెటిజెన్స్ కూడా దీనిపై తమ అభిప్రాయాలని తెలిపారు. తారక్ ఈ సినిమా చేస్తే రికార్డులు బద్దలు అవ్వడం ఖాయం అని అంటున్నారు. కచ్చితంగా ఈ సినిమా చేయడానికి ఎన్టీఆర్ ఒప్పుకుంటారని పాన్ ఇండియా సినిమాగా కాదని దీన్ని పాన్ వరల్డ్ మూవీగా విడుదల చేయాలని అంటున్నారు. తారక్ నటించిన దేవర చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. వచ్చే నెల 27న ప్రేక్షకులు ముందుకి సినిమా రాబోతుంది.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!