Advertisement
సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. నందమూరి తారక రామారావు తనకి వచ్చిన చిన్న అవకాశాన్ని అందిపుచ్చుకొని.. అంచెలంచెలుగా ఎదిగి తెలుగు చిత్ర పరిశ్రమలో మహావృక్షంగా ఎదిగారు. అసమాన నటనతో తెలుగు ప్రజల మనసులు గెలుచుకొని వెండితెరపై ఓ వెలుగు వెలగడమే కాదు, ముఖ్యమంత్రి కుర్చీలో కూడా కూర్చున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కష్టాలను తీర్చి రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా దేశ రాజకీయాలలో సంచలనం సృష్టించారు. ఇక నందమూరి కుటుంబం నుంచి ఎంతోమంది నటులుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో కేవలం కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు.
Advertisement
Read also: యాంకర్ సుమక్క అసలు వయస్సు ఎంతో తెలుసా ?
ఇక రాజకీయాల పరంగా చూస్తే ఎన్టీఆర్ కుటుంబానికి, వైసీపీ ప్రభుత్వానికి మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వంలోని ఎంతోమంది నాయకులు ఎన్టీఆర్ ని ఎంతగా అభిమానిస్తారో తెలిసిన విషయమే. అందుకు గల కారణం ఆయన ప్రజలకు చేసిన మంచి సేవలు అనే చెప్పుకోవాలి. ఇక దివంగత నేత, మాజీ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి కూడా ఎంతోమంది ఎంతో గొప్పగా తెలియజేశారు. అయితే కొంతమంది వైసిపి నేతలు నందమూరి కుటుంబం పై తీవ్ర విమర్శలు చేసినప్పటికీ ఈ విమర్శలపై నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం స్పందించలేదని ఒకానొక సమయంలో ఎన్టీఆర్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ యూనివర్సిటీ విషయంలో కూడా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఓ గొప్ప వ్యక్తి అని చెప్పడంతో జూనియర్ ఎన్టీఆర్ పై చాలామంది నోరు పారేసుకున్నారు.
Advertisement
ఇదిలా ఉంటే తాజాగా.. నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్ స్టాపబుల్ షోకు గెస్టులుగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డిలు హాజరైన విషయం తెలిసిందే. వీరిద్దరూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి అత్యంత సన్నిహితులుగా ముద్రపడ్డారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ, వైఎస్ఆర్ వ్యక్తిత్వం గురించి ఎంతో గొప్పగా చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొందరు ఎన్టీఆర్ అభిమానులు ఒకప్పుడు ఎన్టీఆర్, వైయస్సార్ గొప్పవారు అంటే ఆయనని తీవ్ర స్థాయిలో దుర్భాషలాడారు.. మరి ఇప్పుడు అదే మాటని బాలకృష్ణ అంటున్నారు కదా.. బాలకృష్ణ మాట్లాడిన వ్యాఖ్యలు తప్పు కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ విషయంలో లేచిన నోర్లు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాయని.. బాలకృష్ణ ని ఎదిరించే దమ్ము లేదా అంటూ ఈ వ్యవహారంపై టిడిపి నేతలను ప్రశ్నిస్తున్నారు.