Advertisement
సెలెబ్రిటీలు అన్నాక వారి లైఫ్ స్టయిల్ చాలా వేరుగా ఉంటుంది. వారి గురించిన ప్రతి విషయం కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. వారికి సంబంధించిన ఏ విషయం అయినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ కు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందొ చెప్పాల్సిన పని లేదు. అయితే.. ఆయన ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన వరుసగా మూడు ప్రాజెక్ట్స్ ను లైనప్ లో ఉంచుకున్నారు.
Advertisement
ఎన్టీఆర్ కు అభయ్ రామ్, భార్గవ్ రామ్ అని ఇద్దరు కొడుకులు ఉన్నారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి గురించిన వార్తా ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీరిద్దరికి నందమూరి అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరి గురించిన విషయాలను ఆసక్తిగా షేర్ చేస్తుంటారు. వీరిద్దరికి చైల్డ్ ఆర్టిస్ట్స్ గా నటించడానికి మంచి అవకాశాలే వస్తున్నాయట. అయితే.. ప్రస్తుతం వీరిద్దరూ చదువు మీదే దృష్టి పెట్టారు. ఎన్టీఆర్ కూడా వీరిద్దరిని ఓ ప్రెస్టేజ్ స్కూల్ లో ఉంచి చదివిస్తున్నారట.
Advertisement
వీరిద్దరికి కలిపి కేవలం స్కూల్ ఫీజుల కోసమే ఎన్టీఆర్ ఇరవై లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నారట. వీరిద్దరూ బాగా చదువుకోవాలని ఎన్టీఆర్ భావిస్తున్నారట. వారిద్దరిలో చిన్న పిల్లాడు అయిన భార్గవ్ రామ్ చాలా అల్లరి వాడని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటె.. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా కు సంబంధించి షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించిన యాక్షన్ సన్నివేశాలను తెరపై చూస్తే ఒళ్ళు గగుర్పొడవడం ఖాయమట. ఈ సినిమా రిలీజ్ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.