Advertisement
ఎన్టీఆర్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఎన్టీఆర్ ఎటువంటి పాత్రనైనా చేసి అందర్నీ మెప్పించేవారు. నటరత్న ఎన్టీఆర్ నటుడు గానే కాకుండా ముఖ్యమంత్రిగా కూడా సేవ చేశారు. తెలుగు జాతి తెర మీద చూసిన రాముడు కృష్ణుడు ఎన్టీఆర్ తెలుగు వాళ్ళ మనసులో ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు. ఎన్టీఆర్ నటుడిగా ఆయన జర్నీ మొదలుపెట్టి 73 ఏళ్లు అవుతుంది. 1949లో ఆయన మన దేశం సినిమాలో నటించారు. ఎల్ వి ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్ గా ఒక చిన్న రోల్ చేశారు పాత్ర లో ఆయన ఫుల్లుగా లీనమై పోయావారట.
Advertisement
లాటి తో నిజం గానే కొట్టడం వంటివి చేసేవారట అప్పట్లో నటన మీద ఆయనకి ఉన్న ఇష్టాన్ని దర్శకులు ప్రసాద్ గుర్తించారు. వీటిని బాలయ్య ఎన్టీఆర్ కథానాయకుడిలో ఆసక్తికరంగా చూపించారు అలా మొదలైన తారక రామారావు నటప్రస్థానం చలనచిత్ర పరిశ్రమ తో పాటు ప్రేక్షకుల హృదయాలను ఏలే చక్రవర్తిగా అలానే అందరు మనసులో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడుగా కొనసాగుతుంది. ఎన్టీఆర్ తో పాటుగా లెజెండ్రీ మ్యుజిషియన్ ఘంటసాల, ప్రముఖ నేపధ్య గాయని పి లీల కూడా మన దేశం సినిమా తోనే ఇండస్ట్రీ లోకి వచ్చారు. ఈ సినిమా ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం ఇచ్చారు.
Advertisement
గాయని లీల ఇలా కూడా ఈ సినిమా ద్వారానే తెలుగు సినిమా రంగంలోకి వచ్చారు ఒకే సినిమా ద్వారా రామారావు ఘంటసాల లీల ఇలా ముగ్గురు లిజెండ్రీ పర్సన్స్ పరిచయమయ్యారు. ఎన్టీఆర్ తన నటన తో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు ఆయన వారసత్వం ని పునికి పుచ్చుకుని చాలామంది నందమూరి కుటుంబం నుండి హీరోలుగా మారారు. తాతకి తగ్గ మనవడుగా ఎన్టీఆర్ అలానే బాలయ్య కళ్యాణ్ రామ్ ఇలా హీరోలు వచ్చారు. ఇప్పటికి కూడా చాలా మంది ఎన్టీఆర్ సినిమాలనే చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు ఆయన ఏ పాత్ర లో అయినా సరే జీవించేస్తారు ఆయన మరణం నిజంగా తెలుగు ప్రేక్షకులకి తీరని లోటు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!