Advertisement
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. ‘సాలా క్రాస్ బీడ్’ ట్యాగ్ లైన్, పూరి కనెక్ట్, ధర్మ ప్రొడక్షన్ బ్యానర్స్ పై పూరి, ఛార్మి, కరణ్ జోహార్, హీరూ యష్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే హీరో విజయ్ దేవరకొండ లైగర్ విషయంలో బాగా హడావిడి చేశాడు.
Advertisement
ఎంతగా అంటే విడుదలే తరువాయి మూవీ రికార్డు బద్దలు కొట్టడం ఖాయం అన్నట్లు యాటిట్యూడ్ చూపించాడు. తీరా సినిమా విడుదలయ్యాక అందరి గాలి పోయింది. లైగర్ మూవీలో అసలు విషయం లేదని ప్రేక్షకులు తేల్చేశారు. అసలు ఇది పూరి మార్క్ సినిమా కాదు, ఆయనేనా తీసింది అంటూ విమర్శిస్తున్నారు. అయితే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అని అన్ని రివ్యూలు చెబుతున్నాయి.
చిన్న దర్శకుడు రూ. 100కోట్లు కొల్లగొట్టేలా సినిమా చేస్తుంటే, పూరి మాత్రం ఓ బచ్చగాడిగా ఈ సినిమా చేశాడని మండిపడుతున్నారు ఫ్యాన్స్. ఇది ఇలా ఉండగా లైగర్ విషయంలో ఎన్టీఆర్ చాలా లక్కీ అని చెప్పుకోవాలి. పూరి జగన్నాథ్ లైగర్ సినిమా కథను ఎన్టీఆర్ కి చెప్పారట. 2017లో ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో టెంపర్ సినిమా వచ్చింది. వరుస ప్లాపుల్లో ఉన్న ఎన్టీఆర్ కి అటు పూరీకి ఇద్దరికీ టెంపర్ సినిమాతో మంచి బూస్టప్ వచ్చింది. టెంపర్ హిట్ అయ్యాక పూరికి కూడా క్రేజ్ పెరిగింది. ఎన్టీఆర్ వరస ప్లాపులకు బ్రేక్ పడింది.
Advertisement
దీంతో వెంటనే మరోసారి ఎన్టీఆర్ ను ఏదోలా బుట్టలో పెట్టేసి మరో సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు పూరి. అప్పుడు లైగర్ కథను 2016లో ఎన్టీఆర్ కు చెప్పాడట. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నిర్మించాలని కూడా పూరి ప్లాన్ చేసుకున్నాడు. బాక్సర్ అన్న టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడట. అయితే అప్పటికే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బ్యానర్ లో బాబి హీరోగా జై లవకుశ సినిమా చేయాలని అనుకున్నాడు. దీంతో లైగర్ సినిమా కథ ఏదో తేడా కొడుతుండటంతో ఎన్టీఆర్ ఈ కథను రిజెక్ట్ చేశాడు. ఒకవేళ ఎన్టీఆర్ లైగర్ సినిమా చేసి ఉంటే ఎన్టీఆర్ ఖాతాలో మరో పెద్ద డిజాస్టర్ సినిమా వచ్చి ఉండేది.
READ ALSO : తెలంగాణ లో కోమటి రెడ్డి సత్తా ఎంతో ప్రియాంక ఒక అంచనాకి వచ్చారా ?